Salaar Break-even: సలార్ బ్రేక్ ఈవెన్.. ఇంకా ఎన్ని కోట్లు రావాలో తెలుసా

Salaar: 2023 పూర్తి అయ్యి 2024 వచ్చేసింది.. అయినా కానీ డిసెంబర్ నెలలో మొదలైన సలార్ సందడి ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుతం ఎక్కడ చూసినా సలార్ మానియా కామన్ గా కనిపిస్తోంది. ప్రభాస్ నుంచి వచ్చిన ఈ భారీ హిట్ మూవీ డార్లింగ్ ఫాన్స్ ని తెగ ఖుషీ చేస్తోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 2, 2024, 05:21 PM IST
Salaar Break-even: సలార్ బ్రేక్ ఈవెన్.. ఇంకా ఎన్ని కోట్లు రావాలో తెలుసా

Salaar Collections: ఎన్నో సంవత్సరాల తర్వాత ప్రభాస్ అభిమానులకు సలార్ రూపంలో సందడి వచ్చింది. బాహుబలి తర్వాత ప్రభాస్ ఖాతాలో వరుసగా మూడు డిజాస్టర్ మూవీస్ వచ్చాయి.. భారీ అంచనాల మధ్య వచ్చిన సలార్ పై రిలీజ్ కి ముందు కొన్ని నెగటివ్ టాక్స్ కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో చిత్రం విడుదలయ్యాక ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో అని అందరూ అనుకున్నారు.

కానీ అంచనాలకు మించిన స్థాయిలో ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఓ మంచి మాస్ కమర్షియల్ మూవీగా తన సత్తా చాటుకుంది సలార్.  చత్రపతి మూవీలో మంచి మాస్ రోల్ లో అదరగొట్టిన ప్రభాస్.. మిర్చిలో క్లాస్ తో కూడిన మాస్ రోల్ చేసి మెప్పించాడు. ఆ తరువాత మాత్రం ప్రభాస్ కి పక్క కమర్షియల్ మాస్ సినిమా పడలేదు. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ సలార్ మూవీతో మాస్ అభిమానుల దగ్గర సలామ్ అందుకుంటున్నాడు మన రెబల్ స్టార్. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం కాసుల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. ప్రభాస్ భారీ కటౌట్ తో.. ప్రశాంత్ నీల్ భారీ యాక్షన్ తో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ చిత్రం వసూలు కూడా అదే రేంజ్ లో భారీగా రాబడుతోంది. విడుదలై 10 రోజుల పైనే గడిచిన ఇంకా సాలిడ్ కలెక్షన్స్ తో మంచి ఆక్యుఫెన్సీ మెయింటైన్ చేస్తోంది. 

అయితే ఈ చిత్రం మొదటి మూడు రోజుల తరహాలో ప్రొడక్షన్ హౌస్ నుంచి అఫీషియల్ ఫిగర్స్ రావడం లేదు. దీంతో అభిమానుల్లో అసలు చాలా బ్రేక్ ఈవెన్ అయిందా లేదా అని ఒక సందేహం మాత్రం నెలకొంది. ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు సలార్ ఇప్పటిదాకా వసూలు చేసిన గ్రాస్  520 నుంచి 540 కోట్ల మధ్యలో ఉంది. షేర్ రూపంలో ఇది సుమారు 300 కోట్లకు దగ్గరగా ఉంటుంది. ఇక వీకెండ్ అలానే న్యూ ఇయర్ రోజు మంచి హోల్డ్ కొనసాగించిందని తెలుస్తోంది.

ఇక 600 కోట్లకి చేరువలో ఉన్న ఈ సినిమా వరల్డ్ వైడ్ 345 కోట్ల ప్రీరిలీజ్ థియేటర్ బిజినెస్ జరుపుకుంది అంటే దాదాపు 347 కోట్ల రూపాయలు షేర్ వస్తే ఈ చిత్రం అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయినట్లే. ఇప్పుడున్న కలెక్షన్స్ ప్రకారం సలార్ సినిమా బ్రేక్ ఈవెన్ రీచ్ అవ్వాలి అంటే మరో 50 కోట్ల వరకూ రాబట్టాల్సి ఉంటుంది. 

అయితే ప్రస్తుతం ఏపీ తెలంగాణలో మళ్లీ మామూలు టికెట్ రేట్లు అమలులోకి తేవడంతో.. ఎక్కువ రేట్ ఉన్నప్పుడు ఈ సినిమా చూడడం మిస్సయిన ప్రేక్షకులు ఇప్పుడు ధరలు తగ్గాక చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. దాంతో ప్రస్తుతం సలార్ సినిమాకి సానుకూలత కనిపిస్తోంది. 

దీంతో బ్రేక్ ఈవెన్ సాధించడం ఈజీనే కానీ వెయ్యి కోట్ల మార్కు మాత్రం అసాధ్యమే అని అర్థమవుతుంది‌. కేవలం ఇంకో పది రోజుల్లో సంక్రాంతి హడావిడి మొదలైపోతుంది. గుంటూరు కారం, హనుమాన్ లు ముందు బరిలో దిగుతాయి. ఆ టైంలో తప్పకుండా థియేటర్స్ ని సలార్ ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఈ సినిమాల విడుదలకు 11 రోజుల సమయం ఉంది కాబట్టి ఈ లోపు సలార్ సినిమా థియేటర్స్ కి ఆడియన్స్ ని ఏ మేరకు ఫుల్ చేస్తుంది అనే దానిపైన సలార్ బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అవుతుందా లేదా అనేది ఆధారపడి ఉంది. 

Also Read: Ys Sharmila: వైఎస్ షర్మిల కుమారుడి పెళ్లి ఫిబ్రవరి 17న, ప్రకటించిన వైఎస్ షర్మిల

Also Read: Redmi Note 13 Pro 5G: Redmi Note 13 సిరీస్‌ మొబైల్స్‌ల ధరేంతో తెలుసా? లీక్‌ అయిన ధర, ఫీచర్స్‌ వివరాలు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News