Pushpa Trailer: సోషల్ మీడియాలో ‘పుష్ప’రాజ్ ట్రెండింగ్.. ఆకట్టుకుంటున్న ట్రైలర్ కట్ పిక్స్

Pushpa Trailer: అల్లు అర్జున్, రష్మిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘పుష్ప‘ (Pushpa Movie Updates). డిసెంబరు 17న థియేటర్లలో విడుదల కానుందీ సినిమా. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్ ను డిసెంబరు 6న విడుదల (Pushpa Movie Release Date) చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలో ట్రైలర్ కట్ కు సంబంధించిన కొన్ని ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 3, 2021, 01:34 PM IST
    • సోషల్ మీడియాలో ‘పుష్ప’ మూవీ ట్రెండింగ్
    • ‘పుష్ప’ ట్రైలర్ కట్ అల్లు అర్జున్ పిక్స్ వైరల్
    • డిసెంబరు 6న విడుదల కానున్న ‘పుష్ప’ ట్రైలర్
Pushpa Trailer: సోషల్ మీడియాలో ‘పుష్ప’రాజ్ ట్రెండింగ్.. ఆకట్టుకుంటున్న ట్రైలర్ కట్ పిక్స్

Pushpa Trailer: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో రూపొందిన చిత్రం ‘పుష్ప’ (Pushpa Movie Updates). ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న తొలి పార్ట్ విడుదలకు సిద్ధంగా ఉంది. డిసెంబరు 17న రిలీజ్ (Pushpa Movie Release Date) చేసేందుకు రంగం సిద్ధమైంది. రిలీజ్ రోజు దగ్గర పడనుండడం వల్ల సినిమా ప్రమోషన్స్ లో చిత్రబృందం జోరును పెంచేసింది. ఇప్పటికే సినిమాలోని సాంగ్స్ ను రిలీజ్ చేయగా.. ఇప్పుడీ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ కావాల్సి ఉంది.

డిసెంబరు 6న ‘పుష్ప’ సినిమా ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలో సినిమా ట్రైలర్ గురించి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మాస్ లుక్ లో కనువిందు చేయనున్నారు. తొలిసారి అల్లు అర్జున్ మాస్ లుక్ లో తెరపై సందడి చేయనున్న క్రమంలో ఫ్యాన్స్ లో భారీ అంచనాలే నెలకొన్నాయి.

ట్రైలర్ కట్ పిక్స్ వైరల్ 

మరో మూడు రోజుల్లో ‘పుష్ప‘ సినిమా ట్రైలర్ రిలీజ్ కానున్న నేపథ్యంలో.. ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో ‘పుష్ప‘ మానియా మొదలైంది. సినిమా ట్రైలర్ కట్ లోని ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

బాలీవుడ్ లో రిలీజ్ కు ‘పుష్ప’రాజ్ సిద్ధం..

‘పుష్ప‘ సినిమా హిందీ వర్షెన్ (Pushpa Movie Hindi Rights) రిలీజ్ పై గతంలో కొంత వివాదం (Pushpa Movie Updates) జరిగింది. ఈ వివాదం కారణంగా సినిమా హిందీ వర్షెన్ రిలీజ్ కు అవాంతరాలు ఏర్పాడ్డాయి. అయితే రిలీజ్ దగ్గర పడనుండడం వల్ల మేకర్స్ రంగంలోకి దిగారు. ‘పుష్ప‘ రిలీజ్ కు (Pushpa Trailer) ముందు వివాదానికి ముంగింపు పలికి.. అన్నీ భాషల్లో డిసెంబరు 17న (Pushpa Movie Release Date) సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇదే విషయాన్ని వెల్లడిస్తూ.. సినిమా హిందీ వర్షెన్ కు సంబంధించిన రెండు పోస్టర్లను విడుదల చేశారు.  

Also Read: DHEE 13 Grand Finale : ఢీ-13 గ్రాండ్‌ ఫినాలేలో బన్నీ పంచుల వర్షం..లేటేస్ట్ ప్రోమో అదిరిపోయింది

Also Read: Today OTT Releases: ఈ రోజు ఓటీటీల్లో సందడి చేసే సినిమాలు/వెబ్ సిరీస్​లు ఇవే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News