Raa Raja Movie: ‘రా రాజా’ వాలెంటైన్స్ డే స్పెషల్ పోస్టర్.. త్వరలోనే విడుదల

Raa Raja Special Poster: ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రా రాజా మూవీ టీమ్ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. త్వరలోనే ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Feb 14, 2025, 11:15 AM IST
Raa Raja Movie: ‘రా రాజా’ వాలెంటైన్స్ డే స్పెషల్ పోస్టర్.. త్వరలోనే విడుదల

Raa Raja Special Poster: ఇండియన్ స్క్రీన్ మీద ఇది వరకు రాని ఓ కొత్త సబ్జెక్ట్.. ఎవ్వరూ టచ్ చేయని ఓ ప్రయోగంతో ఓ చిత్రం రాబోతోంది. అసలే ఇప్పుడు యంగ్ డైరెక్టర్లు అంతా కూడా కొత్త కాన్సెప్ట్‌లతో ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేస్తున్నారు. మొహాలు కనిపించుకుండా ఓ ట్రైలర్‌ను కట్ చేయడం అన్నది ఎలాంటి టెక్నీషియన్‌కు అయినా కష్టమే. అలాంటి ఓ విభిన్న ప్రయోగాన్ని ‘రా రాజా’ టీం చేసింది. శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ మీద బి.శివ ప్రసాద్ దర్శకత్వంలో ‘రా రాజా’ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రానికి బూర్లే హరి ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, కిట్టు లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్‌ను వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. 

రోమాలు నిక్కబొడుచుకునేలా, వెన్నులో వణుకు పుట్టేలా కట్ చేసిన ‘రా రాజా’ ట్రైలర్‌ను ఇది వరకే అందరం చూశాం. ఓ కెమెరామెన్ బ్రిల్లియన్స్, ఓ డైరెక్టర్ కొత్త విజన్, ఓ మ్యూజిక్ డైరెక్టర్ పనితనం ఆ ట్రైలర్‌ను చూస్తే అర్థం అవుతుంది. ఒక్క యాక్టర్ మొహం కూడా చూపించకుండా కట్ చేసిన తీరు అద్భుతంగా ఉంటుంది. శేఖర్ చంద్ర మ్యూజిక్, రాహుల్ శ్రీ వాత్సవ్ కెమెరా యాంగిల్స్‌తోనే అందరినీ భయపెట్టేశారు. ఇలాంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఇంత వరకు సినిమా రాలేదు. అసలు ఇలాంటి ట్రైలర్‌ను ఇంత వరకు ఇండియన్ సినీ హిస్టరీలోనే చూసి ఉండరు.

ఇక వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ జనాల్లో మరింత క్యూరియాసిటీని పెంచేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను చిత్రయూనిట్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఈ మూవీ విడుదలకు సిద్దంగా ఉంది. ఇక త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్లు ప్రకటించనున్నారు.

సాంకేతిక బృందం

==> బ్యానర్ : శ్రీ పద్మిణి సినిమాస్
==> దర్శకుడు : బి.శివ ప్రసాద్
==> సంగీత దర్శకుడు : శేఖర్ చంద్ర
==> కెమెరామెన్ : రాహుల్ శ్రీ వాత్సవ్
==> ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : బూర్లే హరి ప్రసాద్
==> లైన్ ప్రొడ్యూసర్ : కిట్టు
==> పీఆర్వో : సాయి సతీష్

Also Read: Modi US Tour:ఎలాన్ మస్క్ తో ప్రధాన మంత్రి మోడీ భేటి..  ఈ అంశాలపైనే ఫోకస్..

Also Read:  Gold Rate Today: అస్సలు తగ్గనంటోన్న బంగారం.. మళ్లీ పెరిగిన పసిడి.. లక్షను తాకుతుందా?   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News