Rajamouli Emotional on Naatu Naatu For Oscars: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో ఆస్కార్ కి నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ విషయం మీద ఎస్ఎస్ రాజమౌళి స్పందించారు. ఈ మేరకు ఒక ఎమోషనల్ నోట్ ను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. మా పెద్దన్న ఆస్కార్ నామినేషన్ కి వెళ్లారు. ఆయన స్వరపరిచిన సాంగ్ ఇప్పుడు ఆస్కార్ బరిలోకి దిగింది.
నేను ఇంకేమీ అడగను ప్రస్తుతానికి నేను నాటు నాటు డాన్స్ తారక్ చరణ్ కంటే ఫాస్ట్ గా చేస్తున్నానంటూ పేర్కొన్నారు. ఇక ఈ పాట రచయిత చంద్రబోస్ గారిని ఉద్దేశిస్తూ కంగ్రాట్యులేషన్స్, ఆస్కార్ స్టేజ్ మీద మన పాట థాంక్యూ అంటూ పేర్కొన్నారు ఇక ఈ సాంగ్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ మాస్టర్ గురించి ప్రస్తావిస్తూ ఈ సాంగ్ కి మీరు చేసిన కాంట్రిబ్యూషన్ అనేది వెలకట్ట లేనిది అని పర్సనల్ ఆస్కార్ మీకే అంటూ పేర్కొన్నారు.
కీరవాణి కుమారుడు కాలభైరవ గురించి మాట్లాడుతూ కాలభైరవ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ నాటు నాటుతో ముందుకు వెళ్లాలని నిశ్చయించుకున్నాను. చాలా కాలం ఆలోచించిన తర్వాత ఆయన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోనే ముందుకు వెళ్లాను, లవ్ యూ భైరి బాబు అంటూ పేర్కొన్నారు. అలాగే రాహుల్ సిప్లిగంజ్ భైరవ ఎనర్జిటిక్ వాయిస్ తో ఈ సాంగ్ వేరే లెవల్ కి వెళ్ళింది అంటూ చెప్పుకొచ్చారు. ఇక నందమూరి తారక రామారావు, రామ్ చరణ్ సింక్, స్టైల్ ఈ సాంగ్ అనేకమంది గుండెల్లోకి వెళ్లి చేరుకునేందుకు కారణమైందని మిమ్మల్ని టార్చర్ పెట్టినందుకు సారీ కానీ ఇంకోసారి పెట్టాల్సి వస్తే కూడా నేను వెనకాడను రాజమౌళి చెప్పుకొచ్చారు.
నేనెప్పుడూ ఏ కలలో కూడా ఆస్కార్ కోసం ఆలోచించలేదు కానీ నాటు నాటు, ఆర్ఆర్ఆర్ ఫాన్స్ మాత్రం వస్తుందని భావించారు. మాకు ఆలోచన లేకపోయినా వారే మమ్మల్ని ముందుండి నడిపించారు. అలాంటి క్రేజీ ఫ్యాన్స్ అందరికీ ఒక పెద్ద హగ్ అంటూ రాజమౌళి చెప్పుకొచ్చారు. అలాగే ఇదంతా తన కుమారుడు కార్తికేయ ఎలాంటి రెస్ట్ లేకుండా చేసిన పనిలో కూడా ఫలితం అని కేవలం అతని వల్ల ఇది సాధ్యమైందని చెప్పుకొచ్చారు. అలాగే ప్రమోషనల్ టీంని కూడా రాజమౌళి అభినందించారు. ఇంక ఒకే ఒక్క అడుగు ఆస్కార్కు మిగిలి ఉందని రాజమౌళి ఎమోషనల్ అయ్యారు.
Aso Read: Pawan Kalyan's Fan Death News: పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి.. అభిమాని మృతి
Also Read:l RGV on Pawan: గుడిలో ఉంటే వారాహి, రోడ్డు మీద ఉంటే పంది.. పవన్ పై మళ్లీ రెచ్చిపోయిన వర్మ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook