Bollywood Raksha Bandhan 2022: బాలీవుడ్‌‌లో సోదర సోదరీమణులు, అక్కాచెల్లెళ్లు, సోదరుల మధ్య వయస్సు తేడా ఎంతో తెలుసా

Bollywood Raksha Bandhan 2022: దేశవ్యాప్తంగా ప్రతి అన్నా చెల్లె, సోదరుడు సోదరి జరుపుకునే రక్షాబంధన్ వచ్చేస్తోంది. బాలీవుడ్ కుటుంబాల్లో రక్షాబంధన్ అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటీనటుల సోదర, సోదరిల మధ్య వయస్సులో ఎంత తేడా ఉందో చూస్తే ఆశ్చర్యపోవడం ఖాయం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 9, 2022, 10:46 PM IST
Bollywood Raksha Bandhan 2022: బాలీవుడ్‌‌లో సోదర సోదరీమణులు, అక్కాచెల్లెళ్లు, సోదరుల మధ్య వయస్సు తేడా ఎంతో తెలుసా

Bollywood Raksha Bandhan 2022: దేశవ్యాప్తంగా ప్రతి అన్నా చెల్లె, సోదరుడు సోదరి జరుపుకునే రక్షాబంధన్ వచ్చేస్తోంది. బాలీవుడ్ కుటుంబాల్లో రక్షాబంధన్ అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటీనటుల సోదర, సోదరిల మధ్య వయస్సులో ఎంత తేడా ఉందో చూస్తే ఆశ్చర్యపోవడం ఖాయం..

రక్షాబంధన్ అనేది సోదర సోదరీమణుల మధ్య అనురాగానికి ప్రతీక. రక్షాబంధన్ అంటే ముందుగా బాలీవుడ్ కుటుంబాలే గుర్తొస్తాయి. ఎందుకంటే రక్షాబంధన్ సందర్భంగా చెల్లె లేదా అక్కలకు ఇచ్చే బహుమతుల ఖరీదు అంత హాట్ టాపిక్‌గా ఉంటుంది. అదే సమయంలో బాలీవుడ్ నటుల కుటుంబంలో అన్నాచెల్లెళ్లు, అన్నాతమ్ముళ్లు, అక్కాచెల్లెళ్ల వయస్సులో కూడా భూమ్యాకాశాలకు ఉన్నంత తేడా ఉంటుంది. చెల్లి కంటే 24 ఏళ్లు పెద్దైతే..మరొకరు 16 ఏళ్లు చిన్నోళ్లు. అయినా సరే వీరి మధ్య బంధం గట్టిగా, అన్యోన్యంగా ఉంటుంది.

సల్మాన్ ఖాన్‌కు చెల్లెలు అర్పితా ఖాన్‌కు మధ్య అనురాగం ఎటువంటిదో అందరికీ తెలిసిందే. అయితే అర్పిత కంటే సల్మాన్ ఖాన్ ఏకంగా 24 ఏళ్లు పెద్దోడు. వాస్తవానికి అర్పితాను సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ దత్తత తీసుకున్నాడు. ఇప్పుడు అర్పిత మొత్తం ఖాన్ కుటుంబానికి గారాలపట్టి. సల్మాన్ ఖాన్‌కు అయితే చెల్లెలంటే మరీ ప్రాణం. ఇక పూజా భట్, అలియా భట్. అలియా భట్ కంటే పూజా భట్ ఏకంగా 21 ఏళ్లు పెద్దది. అంటే ఇద్దరి మధ్య ఒక జనరేషన్ గ్యాప్ ఉంది. 

ఇక మరో నేపధ్యం షాహిద్ కపూర్ వర్సెస్ ఇషాన్ ఖట్టర్. షాహిద్ కపూర్...పంకజ్ కపూర్, నీలిమా అజీమ్‌ల కుమారుడు కాగా, ఇషాన్ ఖట్టర్ నీలిమా అజీమ్, రాజేష్ ఖట్టర్‌ల కుమారుడు. ఈ ఇద్దరి మధ్య 14 ఏళ్లు తేడా ఉంది. ఇక అర్జున్ కపూర్, జాహ్నవి కపూర్ మధ్య 12 ఏళ్ల తేడా ఉంది. అర్జున్ కపూర్..జాహ్నవి కపూర్‌ల తండ్రి ఒక్కరే కానీ తల్లులు వేర్వేరు. 

ఇక షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ చెల్లెలు సుహానా ఖాన్ తరువాత సరోగసీ విధానం ద్వారా షారుఖ్ దంపతులు 16 ఏళ్ల తరువాత మరో కుమారుడిని కన్నారు. సైఫ్ అలీ ఖాన్, అమృతాల కుమార్తె సారా అలీ ఖాన్ వయస్సు 27 ఏళ్లు కాగా..సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్‌ల కుమారుడు తైమూర్ వయస్సు  7 ఏళ్లు అంటే ఇద్దరు అక్కాతమ్ముళ్ల మధ్య వయస్సు తేడా 20 ఏళ్లుంది. 

Also read: Raksha Bandhan Gifts Value: బాలీవుడ్ నటులు రక్షాబంధన్ ఎలా జరుపుకుంటారు, చెల్లెళ్లకు ఇచ్చే బహుమతుల ఖరీదు ఎంతో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News