Deepika Padukone బాయ్ ఫ్రెండ్ పుట్టినరోజు నాడే తల్లి కాబోతున్న దీపికా పడుకొనే.. వైరల్ అవుతున్న వార్త..

Deepika Padukone Baby: ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకొనే ప్రస్తుతం మేటర్నిటీ లీవ్ లో ఉన్న సంగతి తెలిసిందే. 2025 మార్చ్ వరకు దీపికా పడుకొనే సినిమాలకు ఈ దూరంగా ఉండబోతున్నారు. తాజాగా ఇప్పుడు రణ్వీర్ సింగ్ దీపికా పడుకొనేలా మొదటి బిడ్డ ఎప్పుడు పుడుతుంది అనే విషయం మీద ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Sep 4, 2024, 08:44 PM IST
Deepika Padukone బాయ్ ఫ్రెండ్ పుట్టినరోజు నాడే తల్లి కాబోతున్న దీపికా పడుకొనే.. వైరల్ అవుతున్న వార్త..

Deepika Padukone Ranveer Singh Baby: సెప్టెంబర్ నెల రానే వచ్చింది. ప్రముఖ బాలీవుడ్ జంట దీపిక పడుకొనే రన్వీర్ సింగ్ ల అభిమానులు అన్నిటికంటే ఎదురుచూస్తున్నది ఈ నెలలో పుట్టబోయే వారి మొదటి బిడ్డ. ప్రస్తుతం దీపిక గర్భంతో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మొదట్లోనే ఈ జంట తమా ప్రెగ్నెన్సీ గురించి బయటపెట్టింది. సెప్టెంబర్ లో తమ బిడ్డ జన్మించబోతున్నట్లు ప్రకటించారు. 

ఇప్పుడు దీపికా పడుకొనే తొమ్మిదవ నెలలో ఉన్నారు. లండన్ లో డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ జంట ప్రసవానికి సంబంధించిన ప్రిపరేషన్స్ లోబిజీగా ఉన్నారు. ఈనెల ఆఖరిలో బిడ్డ జన్మించే అవకాశం ఎక్కువగా ఉంది. 

అయితే బిడ్డ జన్మించే తేదీ గురించి నాకు ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రన్వీర్ సింగ్ దీపిక పడుకునేలా బిడ్డ సెప్టెంబర్ 28న పుట్టబోతున్నట్లు.. ముంబైలోని సౌత్ బాంబే హాస్పిటల్ లో దీపిక జన్మనివ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

అయితే ఈ సెప్టెంబర్ 28 అనే తేదీకి మరొక ప్రత్యేకత ఉంది. అదే రోజున ప్రముఖ బాలీవుడ్ నటుడు రన్బీర్ కపూర్ కూడా పుట్టారు. ఇక రన్బీర్ కపూర్ దీపిక పడుకునేలా ప్రేమాయణం గురించి తెలియని వారు ఉండరు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే రన్బీర్ కపూర్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన దీపిక పడుకొని అతని పేరుని టాటూ కూడా వేయించుకుంది. 

కానీ దురదృష్టవశాత్తు ఈ జంట బ్రేకప్ అయిపోయింది. అయితే మాజీ బాయ్ ఫ్రెండ్ పుట్టినరోజు నాడే దీపికా పడుకొనే తన బిడ్డకు జన్మనివ్వబోతోంది.. అంటూ ఒక వార్త ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. మరి నిజంగానే దీపికా పడుకొనే అదే రోజు తల్లి కాబోతోందా లేదా వేచి చూడాలి. 

సినిమాలపరంగా చూస్తే దీపిక పడుకొని ఈ మధ్యనే తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన కల్కి 2898 AD సినిమాలో హీరోయిన్ గా నటించింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా విడుదలైన ఈ సినిమాకి త్వరలోనే రెండవ పార్ట్ కూడా రాబోతోంది. అందులో కూడా దీపిక పడుకొని హీరోయిన్ పాత్రలో కనిపించనున్నారు.

Also Read: Harish Rao: వరద బాధితుల కన్నీళ్లు తుడిచిన హరీశ్ రావు.. రేవంత్‌ ప్రభుత్వంపై శాపనార్థాలు

Also Read: Telangana Floods: విరాళంపై రగడ.. వైజయంతి మూవీస్‌కు తెలంగాణ విద్యార్థుల వార్నింగ్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News