Reason Behind ED Targetting Puri Jagannath and Charmee Kaur: విజయ్ దేవరకొండతో లైగర్ అనే సినిమా చేశాడు పూరీ జగన్నాథ్. నిజానికి ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ అందుకున్న పూరి జగన్నాథ్ దాన్లో వచ్చిన లాభాలన్నీ తీసుకొచ్చి విజయ్ దేవరకొండ లైగర్ సినిమా మీద పెట్టాడు. ఎప్పటిలాగే ఛార్మి నిర్మాతగా విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్గా ఈ సినిమా గ్రాండ్ గా ప్రారంభమైంది. వాస్తవానికి ముందుగా దీన్ని తెలుగులో మాత్రమే ప్లాన్ చేశారు కానీ తమ దగ్గర డబ్బులు అయిపోతున్నాయని కరణ్ జోహార్ ను సంప్రదించి సినిమాలో పెట్టుబడి పెట్టమని కోరారు. అనన్య పాండేని ఈ సినిమాలో భాగమయేందుకు కారణమైన కరణ్ జోహార్ కు పూరీ జగన్నాథ్ తో మంచి సన్నిహిత సంబంధాలు ఏర్పడిన నేపథ్యంలో ఆయన కూడా డబ్బులు పెట్టేందుకు ముందుకు వచ్చారు.
అలా కరణ్ జోహార్ ఛార్మి కౌర్, పూరి జగన్నాథ్ నిర్మాతలుగా లైగర్ అనే సినిమా భారీ బడ్జెట్ తో రూపొందింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సినిమా విడుదలైన తరువాత అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఫిర్యాదు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులకు అదే విధంగా సిబిఐ అధికారులకు అందింది. అదేమిటి అంటే ఈ సినిమాలో సీఎం కేసీఆర్ కుమార్తె కవిత పెట్టుబడులు పెట్టినట్లుగా సెప్టెంబర్ 6వ తేదీన కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ నేత బక్క జడ్సన్ ఫిర్యాదు చేశారు.
అప్పట్లో ఈ ఫిర్యాదుని పెద్దగా పట్టించుకోకుండా అందులో లైట్ తీసుకున్నారు అనుకున్నారు కానీ ప్రస్తుతం ఈడి ఇదే ఫిర్యాదును ఆధారంగా చేసుకుని దర్యాప్తు జరుగుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి ముంబై బేస్ గానే పూరి జగన్నాథ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, హైదరాబాదులో ఒక ఆఫీసు ఉండేది కానీ ప్రస్తుతాన్ని దాని నివాసంగా మార్చేసి తన భార్య పిల్లలు అలాగే అత్తగారిని అక్కడ ఉంచారు.ముంబై బేస్ తోనే ఛార్మి ఇద్దరు కూడా వ్యాపార కలాపాలను నిర్వహిస్తున్నారు. అయితే నిన్న హైదరాబాద్ ఈడి ఆఫీస్ కి పూరీ ఛార్మి రావడం హాట్ టాపిక్ గా మారింది. నిన్న ఉదయం వారు విచారణకు హాజరయ్యారు కానీ ఆ విషయం బయటకు రాలేదు.
నిన్న పొద్దుపోయిన తర్వాత ఈ విషయం తెలిసింది. అయితే సుమారు 12 గంటల పాటు వీడియో అధికారులు ఇద్దరిని విచారించినట్లుగా తెలుస్తోంది. దీనికి ముఖ్య కారణం పలు సంస్థల నుంచి ప్రొడ్యూసర్లుగా ఉన్న పూరీ, చార్మి అకౌంట్స్ కి డబ్బులు వచ్చాయని చెబుతున్నారు. విదేశీ ఖాతాల నుంచి కూడా ఈ ఇద్దరి అకౌంట్స్ కి లావాదేవీలు జరిగినట్టు గుర్తించారని తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో ఫారెన్ ఎక్స్చేంజ్ మనీ యాక్ట్ నిబంధనలను కూడా విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపణలు కనిపిస్తున్నాయి. సుమారు 12 గంటల పాటు విచారణ తర్వాత వీరిద్దరూ ఒక వాహనంలో బయటకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు ఎవరు దొరుకుతారా ఎలా బిగించాలా? అని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. అందుకే ఈడి సహా సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలను ప్రతీకార రాజకీయాల కోసం వాడుకుంటున్నారని టిఆర్ఎస్ ఆరోపణలు గుప్పిస్తోంది. ఇక బక్క జడ్సన్ ఫిర్యాదు ఆధారంగా కవితను ఇందులో టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో ఎంతవరకు సఫలం అవుతారు అనేది చూడాల్సి ఉంది.
Also Read: Ariyana Glory Suffers From fatigue : అరియానాకు వచ్చిన రోగం ఇదే.. ఇప్పుడు ఎలా ఉందంటే?.. బిగ్ బాస్ బ్యూటీ పోస్ట్ వైరల్
Also Read: Mahesh Babu foundation: హ్యాట్సాఫ్ మహేష్ .. కృష్ణ మరణించిన రోజే మరో గుండెకు ప్రాణం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook