RRR Movie for Hollywood Critics Association Awards: దక్షిణాది నుంచి ఒక అద్భుతమైన దృశ్య కావ్యాలు అందించిన రాజమౌళి క్రేజ్ ఇప్పుడు అంతకంతకూ పెరుగుతోంది. గతంలో బాహుబలి లాంటి ఫ్రాంచైజ్ తెరకెక్కించి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న రాజమౌళి ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేశారు. అసలు చరిత్రలో కలవని ఇద్దరు స్వాతంత్ర సమరయోధులు కలిస్తే ఎలా ఉంటుందనే ఊహతో తెరకెక్కించిన ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ సినిమా భారత దేశ సినీ చరిత్రలో అనేక రికార్డులు తిరగ రాసిన సంగతి తెలిసిందే.
ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు దక్కించుకుంటుంది. ఈ సినిమాను అయిదు భారతీయ భాషలతో పాటు మరో అయిదు విదేశీ భాషల్లో కూడా విడుదల చేశారు. కానీ ఎప్పుడైతే ఈ సినిమా నెట్ ఫిక్స్ లో విడుదలైందో అప్పటి నుంచి విదేశీ ప్రేక్షకులు ఈ సినిమాకి ఫిదా అవుతున్నారు. సినిమా విడుదలై చాలా రోజులు అవుతున్నా ఇప్పటికీ మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ బెస్ట్ సినిమాల జాబితాలో ఈ సినిమా నిలిచింది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రతి ఏడాది పది మంచి సినిమాలు లిఫ్ట్ చేసి వాటిలో ఒక దానికి ది బెస్ట్ మూవీ అని అవార్డు ప్రకటిస్తారు.
అలా ఈ ఏడాది భారత దేశం నుంచి మన ఆర్ఆర్ఆర్ సినిమా చోటు దక్కించుకోవడం గమనార్హం. అతురే ఆర్ఆర్ఆర్ హిందీ సినిమా అని పేర్కొనడం తెలుగువారికి కాస్త ఇబ్బంది కలిగించే విషయమే అయినా సినిమా ఎవరు తెరకెక్కించారు అనే విషయం భారతదేశం మొత్తం తెలుసు కాబట్టి సినిమా తెలుగువాడి సత్తా చాటుతుంది అని కామెంట్ చేస్తున్నారు. డీవీవీ దానయ్య ఈ సినిమాని సుమారు 400 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో నిర్మించారు.
అలా భారీ అంచనాలతో ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచే అద్భుతమైన స్పందన తెచ్చుకుంటూ సుమారు పదకొండు వందల కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి తెలుగువారి సత్తా చాటింది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ తేజ్ నటించగా ఆయన సరసన సీత పాత్రలో అలియా భట్ నటించింది. కొమురం భీం పాత్రలో నందమూరి తారక రామారావు నటించగా ఆయన సరసన జెన్నీ అనే బ్రిటిష్ భామగా ఒలీవియా మోరిస్ నటించింది. ఇక ఈ సినిమాలో వీరితో పాటు అజయ్ దేవగన్, శ్రియ శరణ్, మకరంద దేశ పాండే, రాహుల్ రామకృష్ణ, చత్రపతి శేఖర్, అలిసన్ డూడ్లీ, వంటి వారు ఇతర కీలక పాత్రలు పోషించారు.
Also Read: Dil Raju Son: మరోసారి తండ్రైన దిల్ రాజు.. వారసుడు వచ్చేశాడుగా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి