Sai Pallavi: అమీర్ ఖాన్ కొడుకుతో సాయిపల్లవి.. వైరల్ అవుతున్న ఫోటో

Sai Pallavi Bollywood Debut:సాయి పల్లవి.. ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేయగలిగే హీరోయిన్. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ భామ జపాన్ లో అమీర్ ఖాన్ కొడుకుతో కలిసి కెమెరా కంటికి చిక్కింది. మరి ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 13, 2024, 07:57 AM IST
Sai Pallavi: అమీర్ ఖాన్ కొడుకుతో సాయిపల్లవి.. వైరల్ అవుతున్న ఫోటో

Sai Pallavi with Aamir Khan Son: సాయి పల్లవి.. అందం.. అంతకుమించిన అభినయంతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచుకున్న హీరోయిన్. చెప్పు మాటలాంటి వ్యక్తి సైతం ఆమె క్రేజ్ చూసి లేడీ పవర్ స్టార్ అనే ట్యాగ్ ఇచ్చారు. అంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో చూడండి. అలాంటి సాయి పల్లవి గత కొద్ది రోజులుగా సినిమాలు తగ్గించేసింది. ఇక ఆమె తన సినీ కెరీర్ కు పుల్ స్టాప్ పెట్టేస్తుంది అని ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే అన్నిటిని తలకిందులు చేస్తూ తిరిగి వరుస క్రేజీ ప్రాజెక్ట్ తో బిజీ అయిపోయింది ఈ బ్యూటీ.

 

ఫిదా భానుమతి అయినా.. శ్యామ సింగ్ రాయ్ రోజీ అయినా.. చేసేది ఏ పాత్ర అయినా అందులో ఇట్టే ఒదిగిపోవడం సాయి పల్లవి కి వెన్నతో పెట్టిన విద్య. ఇక స్క్రీన్ పై సాయి పల్లవి డాన్స్ వేస్తే థియేటర్ దత్తరిల్లాల్సిందే. లవ్ స్టోరీ మూవీ లో ఆమె చేసిన డాన్స్ కు వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇప్పుడు నాగచైతన్య తండేల్ మూవీలో పక్కా పల్లెటూరి అమ్మాయిగా నటిస్తోంది సాయి పల్లవి. చందూ మొండేటి దర్శకత్వం తెరకెక్కుతున్న ఈ చిత్రం పై అంచనాలు భారీగా నెలకొని ఉన్నాయి.ఈ మూవీ తో పాటు శివ కార్తికేయన్ తో కలిసి ఒక యాక్షన్ డ్రామా చేస్తుంది.

వీటితో పాటుగా బాలీవుడ్ బడా హీరో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ తో ఓ హిందీ సినిమాకి సాయి పల్లవి ఓకే చెప్పింది. ఈ మూవీతో ఆమె బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనుంది అని టాక్. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ జపాన్లో జరుగుతుంది .అక్కడ సెట్స్ నుంచి లీకైన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు జపాన్ లో సపరో స్నో ఫెస్టివల్ జరుగుతుండడంతోఈ వేడుకను చిత్ర బృందం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ జునైద్ ఖాన్, సాయి పల్లవితో కలిసి చిత్ర బృందం కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

 

లవ్ స్టోరీ కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఫోటోలు కాస్త బ్లర్ గా హీరో ,హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది అన్న విషయం అర్థం అవుతుంది. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ ఫోటోలు మూవీ పై అంచనాలను పెంచేస్తున్నాయి. సాయి పల్లవి బాలీవుడ్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి మరి.

Also Read: KTR Viral Tweet: శభాష్‌ బావ.. అసెంబ్లీలో దుమ్ము దులిపిన హరీశ్ రావుకు కేటీఆర్‌ ప్రశంసలు

Also Read: TN Assembly: తమిళనాడులో 'జనగణమన' రచ్చ.. అసెంబ్లీని బహిష్కరించిన గవర్నర్‌

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News