Diwali Bonus: సర్కార్‌ ఉద్యోగులకు శుభవార్త.. దీపావళికి ముందే 4 శాతం DAతో పాటు ఊహించని బోనస్‌..

7th Pay Commission: భారత కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఉద్యోగులకు బంపర్‌ గుడ్‌ న్యూస్‌ తెలపబోతోంది. డియర్‌నెస్ అలవెన్స్ (DA) పెంపుపై త్వరలోనే కీలక ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నెలలోని చివరి లేదా అక్టోబర్‌ రెండవ వారంలో ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ డియర్‌నెస్ అలవెన్స్ (DA) 2 నుంచి 3 శాతం పెరిగితే జూలై నెల నుంచి హరియర్స్‌ అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 
 

1 /7

ముఖ్యంగా ఈ డీఏ పెరిగితే కొన్ని లక్షల పెన్షన్‌ దారులకు భారీగా లాభాలు కలిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దీపావళికి ముందే ఈ డియర్‌నెస్ అలవెన్స్‌ని పెంచడానికి సన్నాహాలు చేసేందుకు చర్చులు కూడా జరుపుతోంది.   

2 /7

ఒక వేళ ఈ డీఏ పేరితే కొన్ని కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళికి ముందే డియర్‌నెస్ అలవెన్స్‌తో పాటు జీతాలు పేరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ తమ రాష్ట్ర ఉద్యోగులకు డియర్‌నెస్‌ అలవెన్స్‌ను పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం.   

3 /7

యూపీ రాష్ట్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు డీఏ నుంచి ఏకంగా 4 శాతంకు పైగా పెంచబోతున్నట్లు అధికారిక సమాచారం. అంతేకాకుండా  నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు బోనస్‌ను కూడా అందించబోతున్నట్లు యూపీ సర్కార్‌ భావిస్తోంది.   

4 /7

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఏడాది దీపావళికి ముందే డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచుతుందని, ఈ ఏడాది కూడా పెంచే అవకాశాలు ఉన్నట్లు ఉత్తరప్రదేశ్ ఎంప్లాయీస్ జాయింట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ హరి కిషోర్ తివారీ వెల్లడించారు.  

5 /7

ఇప్పటికే ఈ DA గురించి ప్రభుత్వంలో చర్చలు జరిపిట్లు దీవాళి లోపే ఉద్యోగుల ఖాతాల్లోకి బోనస్‌తో పాటు డియర్‌నెస్ అలవెన్స్ పడే అవకాశాలు ఉన్నట్లు హరి కిషోర్ తివారీ తెలిపారు.   

6 /7

ఇప్పటికే  ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఎడవ వేతర సంఘానికి సంబంధించిన ఉద్యోలకు కరువు భత్యాన్ని కూడా 4 శాతం పెంపుపై ఆమోదం ఇచ్చారు. దీని కారణంగా దాదాపు 8 లక్షలకుపై పెన్షనరులకు ప్రయోజనం లభించినట్లు తెలుస్తోంది.   

7 /7

ఉత్తరాఖండ్‌లో పెంచిన DA ప్రభుత్వం జనవరి 1 నుంచే ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తూ వస్తోంది. దీని కారణంగా ఇప్పటికే చాలా మంది ఉద్యోగాలు ప్రయోజనాలు పొందినట్లు సమాచారం..