Sirivennala Seetharamasastry body shifted to film chamber: దిగ్గజ సినీ సాహిత్యకారుడు సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennala Seetharamasastry) పార్థివ దేహాన్ని కిమ్స్ ఆసుపత్రి నుంచి జూబ్లీహిల్స్‌లోని ఫిలిం ఛాంబర్‌కు తరలించారు. అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం కొద్ది గంటల పాటు ఆయన పార్థివ దేహాన్ని ఛాంబర్ వద్ద ఉంచనున్నారు. నేటి సాయంత్రం ఫిల్మ్ నగర్‌లోని మహాప్రస్థానంలో సీతారామశాస్త్రి అంత్యక్రియలు (Sirivennala last rites) నిర్వహించనున్నారు. అంత్యక్రియలకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.
మంగళవారం (నవంబర్ 30) సాయంత్రం 4.07 గం. సమయంలో సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో (KIMS hospital) సిరివెన్నెల కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా న్యుమోనియాతో బాధపడుతున్న ఆయన ఈ నెల 24న ఆసుపత్రిలో చేరారు. అక్కడే చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆరేళ్ల క్రితం సీతారామశాస్త్రి ఊపిరితిత్తుల క్యాన్సర్ (Lungs Cancer) బారినపడ్డారు. దీంతో రెండు ఊపిరితిత్తుల్లో ఒకదాన్ని వైద్యులు తొలగించారు.
ఇటీవల రెండో ఊపిరితిత్తికి కూడా క్యాన్సర్ సోకడంతో సీతారామశాస్త్రి ఆరోగ్యం విషమించింది. కొద్దిరోజులుగా కిమ్స్ వైద్యులు ఆయనకు ఎక్మోపై చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే ఇన్ఫెక్షన్ ఎక్కువవడం... కిడ్నీ పనితీరు కూడా దెబ్బతినడంతో వైద్యులు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. తెలుగు సినీ సాహిత్యంలో ఎన్నో అద్భుతమైన పాటలతో ప్రేక్షకులను మైమరపింపచేసిన... ఆలోచింపజేసిన సీతారామశాస్త్రి మరణం ఆయన అభిమానులను, చిత్రసీమను విషాదంలో ముంచెత్తింది. సిరివెన్నెల (Sirivennala Seetharamasastry) ఇక లేరనే విషయం తెలిసిన వెంటనే చిరంజీవి, ప్రకాష్ రాజ్, ఉత్తేజ్ సహా పలువురు సినీ ప్రముఖులు కిమ్స్ ఆసుపత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన మరణం చిత్రసీమకు (Tollywood) తీరని లోటు అని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: Sirivennela: చేంబోలు సీతారామశాస్త్రి సిరివెన్నెల సీతారామశాస్త్రిగా ఎలా మారారు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook