Allu Arjun Tests Negative For Covid-19: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనా నుంచి కోలుకున్నాడు. రెండు వారాల చికిత్స, హోం ఐసోలేషన్ అనంతరం తాను కోవిడ్19 నుంచి కోలుకున్నానని తెలిపాడు. 15 రోజుల హోం క్వారంటైన్ తరువాత కరోనా పరీక్షలు చేయించుకోగా, కోవిడ్19 నెగెటివ్‌గా తేలినట్లు పోస్ట్ చేశాడు. ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమిచ్చే బన్నీకి సైతం కరోనా నుంచి కోలుకోవడానికి రెండు వారాల సమయం పట్టడం గమనార్హం.
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ అభిమానులకు నటుడు అల్లు అర్జున్(Allu Arjun) ఓ గుడ్ న్యూస్ చెప్పాడు. గత రెండు వారాలుగా కరోనాతో పోరాటం చేసిన అల్లు అర్జున్ కరోనాను జియించాడు. అందరికీ నమస్కారం. 15 రోజుల హోం క్వారంటైన్ తరువాత నేను కరోనా నుంచి కోలుకున్నాను. నేను కోలుకోవాలని ప్రార్థనలు చేసిన వారికి, మా కుటుంబానికి మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు అంటూ బన్నీ ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో కరోనా కేసులు భారీగా తగ్గాలని ఆకాంక్షించారు.
Also Read: Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు కరోనా పాజిటివ్, హోం ఐసోలేషన్‌లో చికిత్స
Hello everyone ! I have tested negative. I am doing well. Thank you all for the love. pic.twitter.com/srRB07Q3r3
— Allu Arjun (@alluarjun) May 12, 2021
కాగా, టాలీవుడ్‌లో పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోగా, పలువురు కోవిడ్19ను జయించి యథావిధంగా తమ షూటింగ్ పనులతో బిజీ అయ్యారు. మెగా ఫ్యామిలీలో ఇదివరకే చిరంజీవి, రామ్ చరణ్, నాగబాబు, పవన్ కళ్యాణ్(Pawan Kalyan)లకు కరోనా సోకగా అనంతరం కోలుకున్నారు. బన్నీ సైతం కరోనాను జయించిన వార్త తెలపగానే ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. తన కుమారుడు, కూతురు అల్లు అర్హలను రెండు వారాల తరువాత కలుసుకున్న బన్నీ ఆనందాన్ని వీడియో ద్వారా నెటిజన్లతో షేర్ చేసుకున్నాడు.
Also Read: OTT వేదికగా Actor Nithiin లేటెస్ట్ మూవీ చెక్ రిలీజ్, ఫ్యామిలితో కలిసి వీక్షించండి
Meeting family after testing negative and 15 days of quarantine. Missed the kids soo much 🖤 pic.twitter.com/ubrBGI2mER
— Allu Arjun (@alluarjun) May 12, 2021
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook