Devil Chair: ప్రయోగాత్మక చిత్రంతో వస్తున్న యంగ్‌ డైరెక్టర్‌.. ఎవ్వరు ఊహించని కాన్సెప్ట్ తో..!

Adhire Abhi new movie: సాధారణంగా తొలి సినిమా అంటే దర్శకులు..సురక్షితమైన కథాంశాలను ఎంచుకునే ట్రెండ్ మనం చూస్తూ ఉంటాం. కానీ యువ దర్శకుడు గంగ సప్తశిఖర తన తొలి చిత్రం ‘ది డెవిల్స్ చైర్’ ద్వారా ప్రయోగాత్మక కథను.. ఎంచుకుని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.  

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Feb 21, 2025, 09:38 AM IST
Devil Chair: ప్రయోగాత్మక చిత్రంతో వస్తున్న యంగ్‌ డైరెక్టర్‌.. ఎవ్వరు ఊహించని కాన్సెప్ట్ తో..!

Horror thriller Telugu: సినీ పరిశ్రమలో తొలి సినిమా ఎంచుకోవడం.. కొత్త దర్శకులకు ఒక కీలకమైన విషయం. ఎక్కువ మంది సురక్షితమైన కథలను ఎంచుకుంటారు. కానీ కొందరు మాత్రమే విభిన్నమైన కథాంశంతో ప్రయోగాలు చేస్తారు. అలా ప్రత్యేకతను కలిగి ఉన్న యంగ్ డైరెక్టర్ గంగ సప్తశిఖర తన తొలి చిత్రం 'ది డెవిల్స్ చైర్' తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.  

జబర్దస్త్ ఫేమ్ అదిరే అభి హీరోగా నటిస్తున్న ఈ హారర్ థ్రిల్లర్ చిత్రానికి గంగ సప్తశిఖర దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు అప్డేటెడ్ ఏఐ టెక్నాలజీ ని వినియోగించడం విశేషం. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచాయి. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో పాటు, సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్ కూడా సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం.  

గతంలో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న గంగ సప్తశిఖర, తన ప్రతిభతో పలు అవార్డులను సొంతం చేసుకున్నాడు. కనిష్ట బడ్జెట్‌లోనే వినూత్న చిత్రాలను రూపొందించగల సత్తా ఉన్న దర్శకుడిగా గుర్తింపు పొందాడు.  

హీరో అభి మాట్లాడుతూ - "'ది డెవిల్స్ చైర్' అనేది అన్ని భాషల్లో అనువదించదగిన కథ. మానవ లోభం నేపథ్యంలో రాసిన ఈ కథ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. మంచి కథతో పాటు ప్రస్తుత పరిస్థితులకు తగిన సందేశాన్ని ఈ సినిమా అందిస్తుంది" అని అన్నారు.  

దర్శకుడు గంగ సప్తశిఖర తన రెండో చిత్రంగా 'W/O అనిర్వేష్' చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో జబర్దస్త్ రాంప్రసాద్ ప్రధాన పాత్రలో నటించారు. ఫిబ్రవరి 21న 'ది డెవిల్స్ చైర్' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా థ్రిల్, సస్పెన్స్, హారర్ కలిపి ప్రేక్షకులను అలరించేలా ఉంటుందని చిత్రబృందం నమ్మకంగా చెబుతోంది.

కాగా తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కొత్తదనాన్ని అభినందిస్తారు అనేది తెలిసిన విషయమే. కాబట్టి ఈ సినిమాని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో వేచి చూడాలి.

Also Read: Champions Trophy 2025 Ind Vs Ban: శుభమన్‌ గిల్‌ సెంచరీ.. ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ విజయం

Also Read: Champions Trophy 2025: చరిత్ర సృష్టించిన షమీ, హృదయ్‌.. భారత లక్ష్యం 229

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News