Kajal Aggarwal Fitness Secrets: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లలో ఒకరైన కాజల్ అగర్వాల్ కి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఆమె అదే ఏడాది చందమామ అనే సినిమాతో బంపర్ హిట్ అందుకుంది. తర్వాత మగధీర, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, బిజినెస్ మాన్, నాయక్, ఎవడు, టెంపర్, జనతా గ్యారేజ్, నేనే రాజు నేనే మంత్రి వంటి సినిమాలతో ఆమె తెలుగులో టాప్ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది. అయితే కరోనా సమయంలో అనూహ్యంగా ఆమె తన చిన్ననాటి ప్రియుడు గౌతం కిచ్లూని వివాహం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. వివాహం తర్వాత ఒక బిడ్డకు తల్లి అయినా సరే ఆమె అందం ఏమాత్రం తరగడం లేదు, ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత కూడా ఆమె ఫిట్నెస్ ఎలా మైంటైన్ చేస్తోందా అని పలువురు సోషల్ మీడియాలో, నెట్లో కూడా సెర్చ్ చేస్తున్నారు. కాబట్టి ఆమె ఫిట్నెస్ కి సంబంధించి ఆమె డైట్ సీక్రెట్ లను అలాగే బ్యూటీ టిప్స్ ని మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం.
కాజల్ అగర్వాల్ ఫిట్నెస్
కాజల్ అగర్వాల్ ఫిట్నెస్ కి సీక్రెట్ ఏమిటి అని అడిగితే ఆమె ప్రతిరోజు తాను చేసే సూర్య నమస్కారాలు అని చెబుతుంది. అలాగే వారంలో కనీసం మూడు రోజులైనా యోగా చేయకుండా ఆమె ఉండదట, ఇక ప్రతిరోజు క్రమం తప్పకుండా అరగంట కచ్చితంగా వ్యాయామం చేస్తానని అలా వ్యాయామం చేయడం వల్ల రక్తప్రసరణ పూర్తిగా జరిగి ఆరోగ్యంగా ఉండవచ్చని ఆమె చెబుతోంది. అంతేకాక ప్రతిరోజు ఒకే రకమైన వ్యాయామాలు చేస్తూ ఉండకుండా రొటీన్ కి భిన్నంగా ఉండాలని రకరకాల వ్యాయామాలు చేస్తే ఇంకా మంచిదని చెబుతోంది. అలాగే గుండె ఆరోగ్యం కోసం బాడీలో ఎముకలు బలంగా ఉండేందుకు భిన్నమైన వ్యాయామాలు చేయాలని తాను అలాగే చేస్తానని ఆమె అంటుంది. ఇక ఖచ్చితంగా వారంలో రెండు రోజులు స్విమ్మింగ్ చేస్తానని అలా చేయడం వల్ల బాడీ మొత్తానికి వ్యాయామం అందుతుందని ఆమె చెప్పుకొచ్చింది.
కాజల్ అగర్వాల్ డైట్ సీక్రెట్
అయితే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మాత్రమే కాదు కచ్చితంగా సమయానికి కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర కూడా ఉండాలని చెబుతోంది. తాను ఎక్కువగా వ్యాయామానికి సరిపడే విధంగా ఉండే ఆహారం తీసుకుంటానని ఎక్కువ సేపు వ్యాయామం చేస్తాను కాబట్టి దానికి తగిన ఫుడ్ తీసుకుంటానని ఆమె చెబుతోంది. మాంసాహారం కంటే శాఖాహారానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తానని కాజల్ అగర్వాల్ చెప్పుకొస్తోంది. వాస్తవానికి ఆమె ముందు నుంచి మాంసాహారం తీసుకునేది కానీ తర్వాత పూర్తి శాకాహారిగా మారిపోయింది. అప్పటినుంచి ఆయిల్ ఫుడ్స్ కి దూరంగా ఉంటూ ఒకరకంగా ఆర్గానిక్ ఫుడ్ మాత్రమే తీసుకుంటోంది.
కాజల్ బ్యూటీ టిప్స్
ఇక కాజల్ బ్యూటీ టిప్స్ విషయంలో కూడా పెద్దగా మేకప్ కి ప్రిఫరెన్స్ ఇవ్వనని అంటోంది. తన జుట్టుకి రకరకాల క్రీములు పూయకుండా నేచురల్ కొబ్బరి నూనెతో మసాజ్ చేస్తూ ఉంటానని అలాగే సాధారణ కండిషనర్లు, షాంపులు వాడకుండా ఆర్గానిక్ కండిషనర్లు, షాంపులు వాడుతానని చెబుతోంది. అలాగే అన్ని న్యాచురల్ గానే ఉండాలని కోరుకునే ఆమె ఫ్రూట్ బేస్డ్ మాయిశ్చరైజర్ మాత్రమే తన శరీరానికి పట్టిస్తుందట. ప్రతిరోజు శరీరం మీద దృష్టి పెట్టడం అవసరమని అని, అలాగే కొబ్బరికాయలతో చేసిన బ్యూటీ ప్రొడక్ట్స్ వాడతానని తన శరీరానికి అవి బాగా పనిచేస్తాయని అని కాజల్ అంటోంది. అలాగే సన్ స్క్రీన్ కూడా క్రమం తప్పకుండా తనతో క్యారీ చేస్తానని ఒక్కరోజు కూడా దాన్ని మిస్ అవనని కాజల్ చెప్పుకొచ్చింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook