Trolls on Hero Nani: హీరో నానిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్.. సినిమా టికెట్లపై స్పందించడమే కారణమా?

Trolls on Hero Nani: "ఏపీలో థియేటర్ల కంటే పక్కనే ఉన్న కిరాణా షాప్ కలెక్షన్లు బాగున్నాయ"ని హీరో నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేగుతున్నాయి. అటు ప్రభుత్వ సానుభూతి పరులు నానిపై ట్రోలింగ్ చేస్తుండగా.. మరోవైపు ప్రతిపక్ష మద్దతుదార్లు నిత్యావసర వస్తువుల రేట్లు నియంత్రించకుండా సినిమాలపై ప్రతాపం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ వాదనతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 24, 2021, 04:46 PM IST
Trolls on Hero Nani: హీరో నానిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్.. సినిమా టికెట్లపై స్పందించడమే కారణమా?

Trolls on Hero Nani: నేచుర‌ల్ స్టార్ నానిపై సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ స్టార్ట్ అయింది. నాని హీరోగా న‌టించిన 'శ్యామ్‌సింగరాయ్‌' సినిమా విడుదలకు ముందు మీడియాతో మాట్లాడారు. ఆ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరల తగ్గింపుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 

"థియేటర్ కలెక్షన్ల కంటే పక్కనే ఉన్న కిరాణా కొట్లో ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయంటా." అని హీరో నాని అన్నారు. "10, 20 రూపాయలతో సినిమా టికెట్ ధరలను నిర్ణయించిన ప్రేక్షకుడ్ని అవమానించవద్దని" హీరో నాని హితవు పలికారు. 

హీరో నానిపై ట్రోలింగ్

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమా టికెట్ ధరలపై హీరో నాని చేసిన కామెంట్స్ రాజ‌కీయ దుమారాన్ని రేపుతున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కొందరు మంత్రులు హీరో నానిపై విరుచుకుపడ్డారు. "ఇష్టానుసారం సినిమా టికెట్ ధరలను పెంచితే ఊరుకోబోమని".. "సినిమా టికెట్ ధరలు పెంచుకుంటూ పోయి సామాన్యుడి జేబులకు చిల్లులు పెడుతున్నార"ని ఏపీ మంత్రులు మీడియా ముఖంగా వెల్లడించారు. మ‌రోవైపు ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో కొంద‌రు ట్రోల్ చేస్తున్నారు.

టికెట్ ధ‌ర‌లు త‌గ్గించి ప్రేక్ష‌కుల‌ను ఏపీ ప్ర‌భుత్వం అవ‌మానించింద‌ని ఆరోపిస్తున్న నానికి.. అస‌లు అవ‌మానం అంటే అర్థం తెలుసా? అని కొందరు నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి తాను కిరాణా షాపుల వాళ్ల‌ను అవ‌మానించ‌లేదా? థియేట‌ర్ల యజ‌మానుల‌కే త‌ప్ప మిగిలిన వారెవ‌రికీ ఆదాయం ఉండ‌కూడ‌దా అని ప్ర‌శ్నిస్తూ కామెంట్స్ పెడుతుండ‌డం గ‌మ‌నార్హం.

ఏపీ ప్రభుత్వంపై సెటైర్లు

మరోవైపు సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు స్పందిస్తూ.. "సినిమా అనేది జీవితంలో లక్సరీకి సంబంధించినది. సినిమా చూడడం, చూడకపోవడం అనేది ప్రేక్షకుడి ఇష్టం. ప్రజల మీద అంతటి ప్రేమను కురిపించే రాజకీయ నాయకులు.. అటు నిత్యావసర వస్తువుల ధరలు, ఇటు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడంపై ఎందుకు కృషి చేయడం లేద"ని ప్రశ్నిస్తున్నారు. "ప్రజలకు నిత్యావసర వస్తువుల ధరలపై నియంత్రణ చేయకుండా అనవసరమైన విషయాల్లో ఏపీ ప్రభుత్వం తలదూరుస్తుందని" మరికొందరు విమర్శలు చేస్తున్నారు. 

Also Read: AP Movie Ticket Issue: ఏపీలో సినిమా టికెట్ ధరల తగ్గింపుపై హీరో నాని సంచలన వ్యాఖ్యలు

Also Read: Porn Star Offers Footballer: రష్యన్ ఫుట్ బాలర్ కు పోర్న్ స్టార్ సెక్స్ ఆఫర్.. 16 గంటలపాటు ఏకధాటిగా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News