Marco World Wide Collections:మలయాళ కథానాయకుడు ఉన్ని ముకుందన్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘మార్కో’. పూర్తి ఔట్ అండ్ ఔట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన అన్ని వర్గాల ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. అంతేకాదు మలయాళంలొ రూ. 100 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించిన అతి కొద్ది చిత్రాల్లో ఇది ఒకటి. ఇక ప్యాన్ ఇండియా మార్కెట్ లో తెలుగు సినిమాలు మొదటి స్థానంలో ఉన్నాయి. రెండో ప్లేస్ లో శాండిల్ వుడ్, ఆ తర్వాత తమిళం, మలయాళ సినీ ఇండస్ట్రీలున్నాయి. గతేడాది చివర్లో మలయాళ సినీ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ మూవీగా ప్రేక్షకుల మెప్పు పొందిన ‘మార్కో’ మూవీ థియేట్రికల్ రన్ ముగిసింది. అంతేకాదు ఆహాతో పాటు సోనీ లివ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
హనీఫ్ అడేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాను క్యూబ్ ఎంటర్ టైన్ మెంట్స్, ఉన్ని ముకుందన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా ఇప్పటి వరకు చూడని సరికొత్త యాక్షన్ హీరోగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన వసూళ్ల విషయానికొస్తే.. తెలుగులో ఈ చిత్రం రూ. 2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా రూ. 3.10 కోట్ల షేర్ (రూ. 5.85 కోట్ల గ్రాస్)
వసూళ్లను రాబట్టి రూ. 1.1 కోట్ల లాభాలను తెలుగులో అందుకొని ఇక్కడ డీసెంట్ హిట్ ను నమోదు చేసింది.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 21 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగింది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా సాధించిన వసూళ్ల విషయానికొస్తే..
కేరళలో - రూ. 41.80 కోట్ల గ్రాస్
కర్ణాటకలో - రూ. 4.70 కోట్ల గ్రాస్
తెలుగు రాష్ట్రాలు - రూ. 6.30 కోట్ల గ్రాస్ మలయాళ వెర్షన్ కలిపిహిందీతో పాటు రెస్ట్ ఆఫ్ భారత్ కలిపి రూ. 18.25 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఓవర్సీస్ - రూ. 32.40 కోట్ల గ్రాస్..
ప్రపంచ వ్యాప్తంగా రూ. 103.45 కోట్ల గ్రాస్.. (రూ. 48.15 కోట్ల షేర్) అందుకుంది. మొత్తం చేసిన బిజినెస్ లో రూ. 27 కోట్ల పైగా లాభాలతో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతేకాదు మాస్ హీరోగా ఉన్ని ముకుందన్ ను మంచి ఇమేజ్ సంపాదించి పెట్టింది.
ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?
ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.