Veera Simha Reddy Day 4: మూడో రోజు కంటే పుంజుకున్న వీర సింహా రెడ్డి కలెక్షన్స్.. అది కలిసొచ్చిందే!

Veera Simha Reddy Day 4 Collections: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా విడుదలై నాలుగు రోజులు పూర్తి కాగా ఈ సినిమా నాలుగు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది అనే వివరాలు చూద్దాం. 

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 16, 2023, 02:07 PM IST
Veera Simha Reddy Day 4: మూడో రోజు కంటే పుంజుకున్న వీర సింహా రెడ్డి కలెక్షన్స్.. అది కలిసొచ్చిందే!

Veera Simha Reddy 4 Days Collections: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా మొదటి ఆట నుంచే మంచి  పాజిటివ్ టాక్ దక్కించుకోవడంతో సినిమాకి వసూళ్ళలో మంచి జోరు కనిపిస్తోంది. ఈ సినిమా మొదటి రోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో పాతిక కోట్ల 35 లక్షలు వసూలు చేస్తే రెండో రోజు 5 కోట్ల పాతిక లక్షలు వసూలు చేసింది.

మూడో రోజు ఆరు కోట్ల 45 లక్షలు వసూలు చేస్తే నాలుగో రోజు ఏడు కోట్ల పాతిక లక్షలు వసూలు చేసింది. అలా రెండు తెలుగు రాష్ట్రాలలో నాలుగు రోజుల్లో 44 కోట్ల 30 లక్షల షేర్ వసూలు చేస్తే 71 కోట్ల 35 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఇక నాలుగో రోజు ఏరియాల వారీగా పరిశీలిస్తే నైజాంలో రెండు కోట్ల 27 లక్షలు, సీడెడ్ కోటి 98 లక్షలు, ఉత్తరాంధ్ర 73 లక్షలు, ఈస్ట్ గోదావరి 61 లక్షలు, వెస్ట్ గోదావరి 33 లక్షలు, గుంటూరు 51 లక్షలు, కృష్ణాజిల్లా 53 లక్షలు, నెల్లూరు జిల్లా 30 లక్షలు వెరసి నాలుగో రోజు ఏడు కోట్ల పాతిక  లక్షలు షేర్, 12 కోట్ల పాతిక లక్షల గ్రాస్ వసూలు చేసింది.

ఇక నాలుగు రోజులకు కర్ణాటక సహా మిగతా భారతదేశం అంతా మూడు  కోట్ల 50 లక్షలు వసూలు చేస్తే ఓవర్సీస్ లో నాలుగు కోట్ల 80 లక్షల వసూలు చేసి మొత్తం ఇప్పటి వరకు 52 కోట్ల 65 లక్షల షేర్ 88 కోట్ల 15 లక్షల గ్రాస్ వసూలు చేసింది. అయితే ఇవి ట్రేడ్ వర్గాల లెక్కలు కాగా సినిమా యూనిట్ మాత్రం ఇప్పటికే ఈ సినిమా 104 కోట్లు గ్రాస్ వసూలు చేసింది అని అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా బిజినెస్ 73 కోట్లకు జరగడంతో 74 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా నిర్ణయించారు. ఇంకా 21 కోట్ల 35 లక్షల షేర్ వసూలు చేస్తే సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యి హిట్ అవుతుంది. 

Note: ఈ వివరాలు వివిధ ఆన్ లైన్ వేదికల ద్వారా మేము సేకరించినవి, వీటిని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు

Also Read: Mamta Mohandas: మరో వ్యాధి బారిన పడిన మమతా మోహన్ దాస్.. ఎలా అయిపోయిందో చూశారా?

Also Read: Pan India Top 10 Heros: మళ్ళీ పాన్ ఇండియా టాప్ హీరో విజయే..ఇదెక్కడి మాస్ మావా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 
 

Trending News