Nisha patil woman left rs 72 crore property to Sanjay dutt: సాధారణంగా చాలా మందికి రాజకీయా రంగాలకు చెందిన వారు లేదా సినిమా రంగాలకు చెందిన వారు నచ్చుతుంటారు. ఈక్రమంలో వారిని తమ ఫెవరెట్ హీరోలు లేదా రోల్ మోడల్ గా భావిస్తారు. తమ అభిమాన హీరోలు లేదా రోల్ మోడల్ కోసం ఫ్యాన్స్ ఏపనైన చేసేందుకు వెనుకాడరు. కొందరు తమ అభిమానం చాటుకునేదుకు శరీరంపై పచ్చబొట్టు పొడిపించుకుంటారు.
మరికొందరు వారి బర్త్ డే, పెళ్లి రోజుల్లో అన్నదానాలు, పేదలకు బట్టలు పంచిపెడుతుంటారు. రక్తదానాలు మొదలైన కార్యక్రమాలు చేస్తుంటారు. తమ అభిమానిని కలిసేందుకు తెగ తాపత్రయ పడుతుంటారు. ఈ క్రమంలో ఒక అభిమాని చేసిన పని ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
ముంబైకు చెందిన నిషా పాటిల్ అనే మహిళకు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అంటే పిచ్చి అభిమానం. చిన్నప్పటి నుంచి ఆయనను తెగ ఆరాధించేది. ఆయన సినిమాలు వస్తే ఫస్ట్ రోజు బొమ్మ చూడాల్సిందే. ఆయన వందల సినిమాలను ఆమె చూసింది. ఈక్రమంలో సదరు మహిళ వయస్సు ప్రస్తుతం 62 ఏళ్లు. అయితే.. ఆమె ఇటీవల కన్నుమూసింది. ఈ క్రమంలో ఆమె ఆస్తులు దాదాపుగా.. 72 కోట్లను ఏకంగా బాలీవుడ్ హీరో సంజయ్ దత్ పేరు మీదుగా వీలునామా రాసి చనిపోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు.
ఈ విషయాన్ని సంజయ్ దత్ వరకు తీసుకెళ్లారు. అభిమాని చేసిన విషయం తెలిసి సంజయ్ దత్ ఎమోషనల్ కు గురయ్యారు. ఆమెను తాను ఎందుకు కలవలేకపోయానని బాధపడ్డారు. ఆమె తనకు తెలియదని, ఆమె ఆస్తుల్ని తనకు చెందేలా రాసిందని తెలిసిందన్నారు. కానీ తనకు ఆమె ఆస్తుల మీద ఆశలేదన్నారు. దీన్ని ఆమె కుటుంబ సభ్యులకు వెళ్లేలా డాక్యుమెంట్స్ తయారు చేయాలని తమ లీగల్ టీమ్ కు చెప్పినట్లు వెల్లడించారు. ఇలాంటి గొప్ప అభిమాని దొరకడం తన లక్ అన్నారు.
సదరు మహిళ నిషా పాటిల్.. తన చివరి రోజుల్లో.. ఆస్తి డాక్యుమెంట్లను 2018లోనే లీగల్ గా రాయించి, బ్యాంకు అకౌంట్లలో ఉన్న డబ్బుని సంజయ్ దత్ కి అందజేయాలని లెటర్లు రాసి పక్కాగా బదలాయింపు చేసిందన్నారు. ఇంటికి లెటర్ లు వచ్చే వరకు తమకుడా ఈ విషయం తెలీదని ఇంట్లో వాళ్లు చెప్పుకొచ్చారు.
తన అభిమాన హీరోకు కోట్లాది రూపాయలు రాసిచ్చిన , ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఈ విషయం ప్రస్తుతం బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో సంజయ్ దత్ గొప్పతనం పట్ల అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter