Youtuber Harsha Sai Arrest: ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి ఉదంతం మరోసారి అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. ఇప్పటికే రాజ్ తరుణ్ - లావణ్య ఇష్యూ, ఆ తర్వాత జానీ మాస్టర్ - శ్రేష్ఠ వర్మ ఉదంతంతో నేపథ్యంలో సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల ఉదంతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూట్యూబటర్ హర్ష సాయి.. తనను ఆర్ధికంగా మోసం చేయడంతో పాటు తనపై లైంగిక దాడికి పాల్పడనట్టు పోలీసులకు కంప్లైంట్ చేసిన సంగతి తెలసిందే కదా. ఈ ఉదంతంలో హర్ష సాయి పరారీలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతన్ని పట్టుకోవడానికి సైబరాబాద్ కమిషనరేట్ నుంచి విశాఖకు వెళ్లిన ఓ ఎస్సై స్థాయి అధికారి, ఇద్దరు కానిస్టేబుల్స్ హర్షసాయితో పాటు...అతని తండ్రి రాధాకృష్ణ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
అతని సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా భీమిలి, ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో హర్షసాయి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అంతే కాదు అతని బంధువుల, స్నేహితులను కూడా ఈ విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే విజయవాడకు చెందిన ప్రముఖ న్యాయవాదిని హర్ష సాయి నియమించుకున్నట్లు తెలుస్తోంది.
హర్ష సాయి విషయానికొస్తే.. పేదలకు పైసలు పంచుతూ ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. పెద్ద సెలబ్రిటీ అయ్యాడు.ఈ సెలబ్రిటీ ఇమేజ్ తోనే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.ఆ తర్వాత ఇతను ఓ సినిమాలో హీరోగా నటించారు. ఈ సినిమా కోసం తన నుంచి రూ. 2 కోట్లు తీసుకోవడంతో పాటు.. తనను తన మత్తు మందు ఇచ్చిన తర్వాత తనపై లైంగిక దాడి పాల్పడటంతో పాటు తన నగ్న ఫోటోలును తీసి బ్లాక్ మెయిలింగ్ కు దిగినట్టు మిత్రా శర్మ.. రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీసులకు కంప్లైంట్ చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంలో హర్షసాయి తండ్రి రాధాకృష్ణ ఇన్వాల్వమెంట్ కూడా ఉందని సదరు యువతి చెబుతుంది. దీంతో హర్ష సాయితో పాటు ఆయన తండ్రి రాధాకృష్ణ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!
ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.