Vishnu Manchu Trolls సోషల్ మీడియాలో మంచు విష్ణు మీద జరిగే ట్రోలింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. మొత్తం మంచు ఫ్యామిలీ మీద సెటైర్లు పడుతుంటాయి. మీమ్స్, ట్రోల్స్‌లో మంచు ఫ్యామిలీ ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. మా ఎన్నికల టైం, సన్నాఫ్ ఇండియా, జిన్నా సమయాల్లో మంచు ఫ్యామిలీ మీద జరిగినంత ట్రోలింగ్ మరెప్పుడూ జరిగి ఉండదు. మంచు విష్ణు తన డైట్, తన జిమ్ గురించి చెబుతూ మాట్లాడిన మాటల మీద విష్ణుప్రియ కౌంటర్లు వేసింది.
నేను సరిగ్గా డైట్ ప్లాన్ చేసి, వర్కౌట్ చేస్తే మిస్టర్ ఇండియా అవుతాను అంటూ మంచు విష్ణు మాట్లాడిన మాటల మీద విష్ణు ప్రియ స్పందించింది. రెండ్రోజులు జిమ్‌కు వెళ్లిన ఫ్రెండ్ ఇలా మాట్లాడతాడంటూ మీమ్ వీడియో వైరల్ కాసాగింది. దానిపై విష్ణుప్రియ కౌంటర్ వేస్తూ.. నేను కూడా మిస్ ఇండియా అవుతాను అంటూ నవ్వేసింది.
అంటే విష్ణుప్రియ కూడా ఓ రెండ్రోజులు జిమ్ చేసి ఇలా బిల్డప్ ఇస్తుందని చెప్పకనే చెప్పేసింది. కానీ విష్ణుప్రియ మాత్రం గత రెండేళ్లుగా వర్కౌట్లు చేస్తూనే ఉంది. జిమ్‌లో కష్టపడుతూ ఉంది. జంపింగ్‌లు చేస్తూ స్టంట్స్‌లో ట్రైనింగ్ తీసుకుంటోంది. విష్ణుప్రియ ఇప్పుడు బుల్లితెరకు దూరంగా ఉంటోంది.
మానస్‌తో కలిసి చేసన జరీ జరీ పంచెకట్టు అంటూ సాగిన ప్రైవేట్ ఆల్బమ్ నెట్టింట్లో వైరల్ అయింది. మానస్, విష్ణుప్రియ జోడికి అంతా ఫిదా అయ్యారు. ఇక అందులో తన భారీ అందాలను ప్రదర్శించి విష్ణుప్రియ అందరినీ అవాక్కయ్యేలా చేసింది. మొన్నటికి మొన్న బుల్లితెర ఈవెంట్లో రొమాంటిక్ సాంగ్ చేసేసింది ఈ జంట.
మళ్లీ ఇప్పుడు విష్ణుప్రియ బుల్లితెర ఈవెంట్లు, స్పెషల్ ఎపిసోడ్స్ అంటూ సందడి చేస్తోంది. శ్రీదేవీ డ్రామా కంపెనీ, స్టార్ మా పరివారం అంటూ వస్తోన్న షోలో కనిపించింది. కానీ విష్ణుప్రియ మాత్రం తన ఫోకస్‌ను సినిమాల మీద పెట్టినట్టు అనిపించడం లేదు. అయితే వెబ్ సిరీస్‌లో నటిస్తోన్నట్టుగా తెలుస్తోంది.
Also Read: Rajamouli murder Plan : రాజమౌళి హత్యకు కుట్ర.. హెచ్చరించిన రామ్ గోపాల్ వర్మ
Also Read: Thaman Trolls : ఇక్కడ శివుడంటాడు.. అక్కడ చచ్చినా పర్లేదంటాడు.. తమన్ అతి డైలాగులపై సెటైర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి