Beauty Movie First Look Poster: వరుస ప్రాజెక్ట్‌లతో వానరా సెల్యూలాయిడ్ బ్యానర్ ఆడియన్స్‌ను అలరిచేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే త్రిబాణదారి బార్బరిక్ అంటూ ఓ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీతో త్వరలోనే ప్రేక్షకులను పలకరించనుడంగా.. తాజాగా మరో సినిమాను అనౌన్స్ చేసింది. మారుతీ టీమ్ ప్రొడక్ట్, జీ స్టూడియోస్‌తో కలిసి వానరా సెల్యూలాయిడ్ సంయుక్తంగా ‘బ్యూటీ’ అనే మూవీని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి వర్ధన్ దర్శకత్వం వహిస్తుండగా.. అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కె ఆర్ బన్సాల్ నిర్మాతలుగా వ్యవహరించారు. అంకిత్ కొయ్య, నీలఖి హీరోహీరోయిన్స్‌గా యాక్ట్ చేస్తున్నారు. బీఎస్ రావు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా పనిచేస్తున్నారు. తాజాగా బ్యూటీ మూవీ టైటిల్ ప్రకటించడంతోపాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
మోషన్ పోస్టర్‌ను ఇంట్రెస్టింగ్‌గా క్రియేట్ చేశారు. బీచ్, రోడ్డు, ఇళ్లు.. చివర్లో హీరో హీరోయిన్లను రొమాంటిక్‌గా చూపిస్తూ టైటిల్‌తోనే ఆసక్తి కలిగించారు. విజువల్స్, ఆర్ఆర్ సూపర్‌గా ఉంటుందని మేకర్స్ హింట్ ఇచ్చారు. ముఖ్యంగా యూత్‌ను ఆకట్టుకునేలా సినిమాను తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. ఆయ్, మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం వంటి హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన అంకిత్ కొయ్య.. ఈ సినిమాలో సోలో హీరోగా మెప్పించేలా ఉన్నారు. నరేష్, వాసుకి, నంద గోపాల్, సోనియా చౌదరి, నితిన్ ప్రసన్న, మురళీ గౌడ్, ప్రసాద్ బెహరా తదితర స్టార్లు కీలక పాత్రల్లో యాక్ట్ చేశారు.
ఈ సినిమాకు శ్రీ సాయి కుమార్ సినిమాటోగ్రఫర్‌గా వర్క్ చేస్తున్నారు. విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ అందిస్తుండగా.. ఆర్ట్ డైరెక్టర్‌గా బేబీ సురేష్ భీమగాని పని చేస్తున్నారు. ఎడిటింగ్ బాధ్యతలను ఎస్‌బి ఉద్ధవ్ నిర్వర్తిస్తున్నారు. ఈ ఏడాదిలోనే బ్యూటీ చిత్రాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
టెక్నీకల్ టీమ్
==> డైరెక్టర్: వర్ధన్
==> ప్రొడ్యూసర్స్: అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కేఆర్ బన్సాల్
==> బ్యానర్లు: వానరా సెల్యులాయిడ్, జీ స్టూడియోస్, మారుతీ టీమ్ ప్రొడక్ట్
==> ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బి.ఎస్. రావు
==> DOP: శ్రీ సాయి కుమార్ దారా
==> మ్యూజిక్: విజయ్ బుల్గానిన్
==> EDITOR: SB ఉద్ధవ్
==> ART: బేబీ సురేష్ భీమగాని
==> PRO: సాయి సతీష్
Also Read: Liquor consumption: దక్షిణాదిలోనే తాగుబోతులు ఎక్కువ.. ఏ రాష్ట్రం టాప్ ప్లేస్ అంటే.. !
Also Read: Jio: జియో మైండ్‌బ్లోయింగ్ 84 రోజుల ప్లాన్.. అపరిమిత వాయిస్ కాలింగ్, ప్రతిరోజు 2GB డేటా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter