Prabuthwa Junior Kalashala: ప్రమోషన్స్‌లో 'ప్రభుత్వ జూనియర్ కళాశాల' జోరు.. ఫుల్ వీడియో సాంగ్ విడుదల

Challa Gaali Video Song: ప్రభుత్వ జూనియర్ కళాశాల మూవీ ప్రమోషన్స్‌లో జోరు పెంచారు మేకర్స్. తాజాగా సినిమా విడుదలకు ముందే చల్లగాలి అంటూ సాగే ఫుల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 4, 2024, 08:06 PM IST
Prabuthwa Junior Kalashala: ప్రమోషన్స్‌లో 'ప్రభుత్వ జూనియర్ కళాశాల' జోరు.. ఫుల్ వీడియో సాంగ్ విడుదల

Challa Gaali Video Song: ఇంటర్ మీడియట్ లవ్ స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన మూవీ ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143. ఈ సినిమాలో ప్రణవ్, షజ్ఞ శ్రీ జంటగా నటించగా.. శ్రీనాథ్ పులకురం దర్శకత్వం వహించారు. కొవ్వూరి అరుణ గారి సమర్పణలో భువన్ రెడ్డి కొవ్వూరి ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. రీసెంట్‌గా ఫస్ట్ గ్లింప్స్, టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి రెండో సాంగ్ చల్లగాలి అంటూ సాగే రొమాంటిక్ పాటని వీడియో సాంగ్ మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటివరకు లిరికల్ సాంగ్స్‌ను రిలీజ్ చేయగా.. మొదటిసారి సినిమా విడుదలకు ముందే వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి చీఫ్‌ గెస్ట్‌గా సీనియర్ జర్నలిస్ట్ ప్రభు హాజరయ్యారు.

ప్రభు మాట్లాడుతూ.. 2000's బ్యాక్ డ్రాప్‌ను నేటివిటికి తగినట్టుగా సినిమాను తెరకెక్కించారని.. విజువల్స్ చాలా బాగున్నాయని మెచ్చుకున్నారు. మంచి సినిమా, మంచి కంటెంట్‌కు మీడియా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందన్నారు. డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో ప్రైవేట్ కాలేజీలు తప్ప.. ప్రభుత్వ జూనియర్ కళాశాల అనే మాట చాలా తక్కువ వినిపిస్తోందన్నారు. 2000's బ్యాక్‌డ్రాప్‌లో పుంగనూరు విలేజ్‌లో జరిగిన ఒక రియల్ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలిపారు. ఒక మంచి మూవీని మంచి బ్యానర్ అండ్ డీసెంట్ బడ్జెట్‌తో రూపొందించామన్నారు. తమ సినిమాను ప్రేక్షకులు, మీడియా సపోర్ట్ చేసి ఆశీర్వదించాలని కోరారు. మంచి కాన్సెప్ట్‌తో కొత్త కథగా సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నామని.. మంచి విజయం అందించాలని నిర్మాత భువన్ రెడ్డి కొవ్వూరి తెలిపారు.

హీరో ప్రణవ్ మాట్లాడుతూ.. దర్శకుడు శ్రీనాథ్ తనను నమ్మి ఈ కథకు తనను ఎంపిక చేయడం సంతోషంగా ఉందన్నారు. షార్ట్ ఫిల్మ్స్‌తో ఒక నటుడిగా ఎదగాలనుకున్న తనను హీరోను చేశారని అన్నారు. స్టోరీ చాలా కొత్తగా ఉంటుందని..  రెండు దశాబ్దాల వెనక్కు వెళ్లేలా రియలిస్టిక్‌గా ఈ మూవీని చేశామన్నారు. హీరోయిన్ షజ్ఞ శ్రీ మాట్లాడుతూ.. ఈ సినిమాకి తనను సెలెక్ట్ చేసుకున్నందుకు దర్శకుడు శ్రీనాథ్‌కు థాంక్స్ చెప్పారు. ఇప్పుడు విడుదలైన సాంగ్ విజువల్స్ చాలా బాగా వచ్చాయన్నారు. టేకింగ్, నిర్మాత ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సాంగ్‌ను, సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారని చెప్పారు. ఎడిటర్‌గా కోదాటి పవన్ కళ్యాణ్ పనిచేశారు. కార్తీక్ రోడ్రిగ్జ్ మ్యూజిక్ అందించగా.. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కమ్రాన్ అందించారు.  

Also Read: Oppo Reno 11 Series: శక్తివంతమైన 50MP కెమెరాతో మార్కెట్‌లోకి Oppo Reno 11, Reno 11 Pro మొబైల్స్‌..విడుదల తేది అప్పుడే..

Also Read: Ayodhya Rammandir Features: అయోధ్య రామమందిరం ఎలా ఉంటుంది, ప్రత్యేకతలేంటి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News