హెచ్ఎండీ గ్లోబల్ తన నూతన నోకియా స్మార్ట్ఫోన్లు నోకియా 6(2018), నోకియా 7 ప్లస్, నోకియా 8 సిరోకోలను కొద్ది సేపటి క్రితమే విడుదల చేసింది. ఈ స్మార్ట్ఫోన్లలో ఫేస్ అన్‌లాక్, ప్రొ కెమెరా మోడ్ అనే ఫీచర్లు కామన్‌గా ఉండనున్నాయి. బ్లాక్/కాపర్, వైట్/ఐరన్, బ్లూ/గోల్డ్ రంగుల్లో లభించే నోకియా 6 (2018) స్మార్ట్‌ఫోన్ రూ.16,999 ధరకు ఈ నెల 6వ తేదీ నుంచి లభ్యం కానుంది.
అలాగే బ్లాక్/కాపర్, వైట్/కాపర్ రంగుల్లో నోకియా 7 ప్లస్ స్మార్ట్‌ఫోన్ రూ.25,999 ధరకు, నోకియా 8 సిరోకో బ్లాక్ కలర్లో రూ.49,999 ధరకు ఈ నెల 30వ తేదీ నుంచి లభ్యం కానుంది.ఈ నెల 20వ తేదీ నుంచి అమెజాన్, నోకియా, ఫ్లిప్‌కార్ట్, ఆన్లైన్ స్టోర్లలో ఈ ఫోన్ల ప్రీ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.
నోకియా 6 (2018) ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, అల్యుమీనియం యునీబాడీ కాస్టింగ్, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.
నోకియా 7 ప్లస్ ఫీచర్లు
6 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 12, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్ సి, 3800 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.
నోకియా 8 సిరోకో ఫీచర్లు
5.5 ఇంచ్ డిస్ప్లే, 2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, బారోమీటర్, ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, యూఎస్బీ టైప్ సి, 4జీ వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్సీ, 3260 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్లెస్ చార్జింగ్.