విజయ్ మాల్యా మూడో పెళ్లికి కత్రినా కైఫ్ వెళ్తుందట.?

లిక్కర్ వ్యాపారి విజయ్‌ మాల్యా మూడోసారి పెళ్లి చేసుకోనున్నారట. 

Last Updated : Mar 31, 2018, 10:44 AM IST
విజయ్ మాల్యా మూడో పెళ్లికి కత్రినా కైఫ్ వెళ్తుందట.?

లిక్కర్ వ్యాపారి విజయ్‌ మాల్యా మూడోసారి పెళ్లి చేసుకోనున్నారట. గత ఏడేళ్లుగా తనతో పాటు సహజీవనం చేస్తున్న పింకీ లాల్వానీ అనే సుందరిని ఆయన వివాహం చేసుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. భారత్‌లో బ్యాంకులకు 9000 కోట్ల రూపాయల మేర కుచ్చుటోపీ పెట్టి లండన్‌లో ఉంటున్న ఈ మాజీ కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ అధినేత.. పింకీతో పెళ్లికి అన్ని వైపులా నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో వివాహానికి సిద్దమైనట్లు సమాచారం.

2011లో పింకీ ఎయిర్‌హోస్టెస్‌ ఉద్యోగానికి వచ్చింది. అప్పుడే ఆమెను చూసి మనసు పారేసుకున్నాడట మాల్యా. అప్పటి నుంచే ఇద్దరూ సహజీవనం చేస్తున్నారని టాక్. సింధీ కుటుంబానికి చెందిన పింకీ వయసు 27 ఏళ్లు కాగా.. మాల్యా వయస్సు 62 సంవత్సరాలు. అయితే ప్రస్తుతం మాల్యా పెళ్లికి ఎవరెవరు వస్తున్నారన్న విషయం కూడా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

ముఖ్యంగా బాలీవుడ్ తారలు దీపికా పదుకొణే, కత్రినా కైఫ్, నర్గీస్ ఫక్రీ మాల్యా మూడో వివాహానికి హాజరుకానట్లు పలు పత్రికలు వార్తలు రాస్తున్నాయి. అయితే వీరందరూ కూడా గతంలో మాల్యా నడిపిన కింగ్ ఫిషర్స్ క్యాలెండర్‌కి మోడల్స్‌గా పనిచేసిన వారే కావడం గమనార్హం. గతంలో కూడా మాల్యా కుమారుడు సిద్దార్ధ్‌తో దీపిక కొన్నాళ్లు డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. 

Trending News