Pawan Kalyan | అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్(Pawan Kalyan) మెగా అభిమానులకు ఓ గుడ్ న్యూస్ వినిపించారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్‌(Ram Charan)తో తాను ఓ సినిమా నిర్మిస్తానని అప్పుడెప్పుడో పవన్ కల్యాణ్ చేసిన ఓ ప్రకటన మెగా అభిమానులను ఆనందానికి గురిచేసింది.

Last Updated : Dec 15, 2019, 06:10 PM IST
Pawan Kalyan | అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన పవన్ కల్యాణ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) మెగా అభిమానులకు ఓ గుడ్ న్యూస్ వినిపించారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్‌(Ram Charan)తో తాను ఓ సినిమా నిర్మిస్తానని అప్పుడెప్పుడో పవన్ కల్యాణ్ చేసిన ఓ ప్రకటన మెగా అభిమానులను ఆనందానికి గురిచేసింది. ఆ ఇద్దరు కలిసి పనిచేస్తే చూడాలని మెగా అభిమానులు సైతం చాలాకాలంపాటే ఎదురుచూశారు. కానీ ఆ తర్వాత పవన్ కల్యాణ్ జనసేన పార్టీ(Jana Sena Party) స్థాపించి రాజకీయాలతో బిజీ అవడంతో ఆ సినిమా పట్టాలెక్కనేలేదు. దీంతో పవన్ నిర్మాణంలో చెర్రీ సినిమా ఇక అటకెక్కినట్టేనని అనుకుంటున్న తరుణంలో తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి చెర్రీతో సినిమాపై పవన్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ఇంటర్వ్యూలో పవన్ మాట్లాడుతూ.. చెర్రీతో సినిమా చేసే ప్రయత్నం ఆగిపోలేదని అన్నారు. సరైన దర్శకుడు, కథ ఫిక్స్ అయిన తర్వాత తమ కాంబోలో సెట్స్‌పైకి వెళ్లబోయే సినిమా గురించి తానే ప్రకటిస్తానని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి మెగా అభిమానుల్లో ఆశను చిగురింపచేశాయి. పవన్ కల్యాణ్ నిర్మాణంలో రాంచరణ్ సినిమా అంటే ఆ ఇద్దరు హీరోల అభిమానులకు పండగే కదా మరి. 

అదే సమయంలో తన రీ ఎంట్రీ గురించి కూడా పవన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన సినిమా కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని.. అయితే, అదే సమయంలో అందరూ తన సినిమాపై దృష్టిపెట్టకుండా ప్రస్తుత రాజకీయాలపై చర్చిస్తే బాగుంటుందని సూచించారు.

Trending News