Indian railways announcement: ప్రస్తుతం దసర పండుగ నేపథ్యంలో చాలా మంది తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇండియన్ రైల్వేస్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిందని తెలుస్తోంది.
దేశంలో ప్రస్తుతం దసరా, దీపావళి పండుగ సీజన్ నడుస్తోంది. ప్రజలు ఉద్యోగాలు, చదువుల కోసం ఇతర ప్రదేశాలలో ఉంటారు. కానీ పండుగ వచ్చిందంటే మాత్రం.. తమ సొంత ఊర్లకు వెళ్లేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు.
ఈ నేపథ్యంలో ఇండియన్ రైల్వేస్ అదిరిపోయే శుభవార్త చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లేవారు ఎక్కువగా ట్రైన్ లలో జర్నీలు చేస్తుంటారు. ఒకవైపు దసరాల, దీపావళి నేపథ్యంలో ఇప్పటికే రైళ్లన్ని రిజర్వేషన్ లు ఫుల్ అయిపోయినట్లు తెలుస్తోంది.
పండగ వచ్చిందంటే చాలు.. రైళ్లన్ని కిట కిటలాడుతుంటాయి. ప్రయాణికులు నానా అవస్థలు పడి రైళ్లలో ఏ కొంచెం ప్లేస్ దొరికిన సరే.. అని రైళ్లలోకి తమ సొంత గ్రామాలకు వెళ్తుంటారు. దీంతో ప్రతి సారి ప్రయాణికులకు మాత్రం ఇది పెద్ద టాస్క్ లాగా ఉంటుందని చెప్పుకొవచ్చు..ఈ నేపథ్యంలో ఇండియన్ రైల్వేస్ అదిరిపోయే శుభవార్త చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లేవారు ఎక్కువగా ట్రైన్ లలో జర్నీలు చేస్తుంటారు. ఒకవైపు దసరాల, దీపావళి నేపథ్యంలో ఇప్పటికే రైళ్లన్ని రిజర్వేషన్ లు ఫుల్ అయిపోయినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. ఇండియన్ రైల్వేస్ ఈసారి దసరా,దీపావళి పండగకు ప్రయాణికులు ఇబ్బందులు కల్గకుండా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ఆదేశాలు సైతం జారీ చేసినట్లు సమాచారం.
ముఖ్యంగా.. దసరా,దీపావళి, ఛత్ పూజలు టార్గెట్ గా.. సొంత ఊర్లకు వెళ్లేవారికోసం.. దాదాపు ఆరు వేల ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. అంతే కాకుండా.. ఇప్పుడున్న ట్రైన్ లకు అదనపు భోగీలను కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
గతేడాది.. పండగ నేపథ్యంలో.. ఇండియన్ రైల్వేస్.. 4,429 రైళ్లను నడిపినట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈసారి రద్దీ ఎక్కువగా ఉండటంతో.. 5,975 రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే మంత్రి వెల్లడించారు.
ప్రస్తుతం మరో 108 రైళ్లకు సాధారణ కోచ్ లను పెంచినట్లు తెలిపిన రైల్వే శాఖ.. 12,500 కోచ్ లు దీని వల్ల అందుబాటులోకి వచ్చినట్లు తెలిపింది. ఈ సదుపాయం వల్ల దాదాపుకోట్లాది ప్రయాణికులు ఎంతో ఈజీగా తమ గమ్య స్థానాలకు వెళ్లవచ్చని కూడా రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది