'లక్ష్మీస్ ఎన్టీఆర్' వివాదం: ఈసీ నిర్ణయంపై వర్మ రియాక్షన్ ఇదే

 లక్ష్మీస్ ఎన్టీఆర్ విషయంలో  ఎన్నికల కమిషన్ తమ పట్ల పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తోందని రాంగోపాల్ వర్మ విరమ్శించారు.   

Last Updated : May 1, 2019, 11:59 AM IST
'లక్ష్మీస్ ఎన్టీఆర్' వివాదం: ఈసీ నిర్ణయంపై వర్మ రియాక్షన్ ఇదే

'లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీని ఏపీలో విడుదల కానివ్వకుండా అడ్డుకున్న ఈసీపై దర్శకుడు వర్మ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూవీ రీలీజ్ విషయంలో ఈసీ నిర్ణయంపై కోర్టులో సవాల్ చేస్తానుంటున్నారు. 
ఏపీ హైకోర్టు తీర్పును అనుసరించే తాము ఈ రోజు సినిమా విడుదలకు ప్లాన్ చేసుకున్నామని పేర్కొన్న వర్మ...ఎన్నికల కమిషన్ తమ పట్ల పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తోందని విరమ్శించారు. 
సినిమా విడుదలకు అనుమతించిన తరువాత ఇలా చేయడం ఏంటని ప్రశ్నించారు.  ఈ సంరద్భంగా వర్మ మాట్లాడుతూ ఈ మొత్తం వ్యవహారం వెనకున్న బలమైన శక్తి ఎవరో అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. ఈ మేరకు వర్మ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు

 

Trending News