పూజా దడ్వాల్.. సల్మాన్ ఖాన్‌తో కలిసి 1990లో ‘వీర్ ఘటి’ అనే చిత్రంలో హీరోయిన్గా నటించారు. అయితే ఈమె ప్రస్తుతం కడు బీదరికంలో జీవిస్తున్నారు. క్షయవ్యాధితో బాధపడుతూ.. కనీసం టీ కొనుక్కోవడానికైనా ఇతరులపై ఆమె ఆధారపడుతున్నారని కొన్ని పత్రికలు వార్తలు రాయడం గమనార్హం. బాలీవుడ్లో పూజా దడ్వాల్ అనేక చిత్రాల్లో నటించారు. హిందుస్థాన్, సింధూర్, సౌగంధ్ చిత్రాలతో ఆమె కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్నారు.
అయితే గత కొంతకాలంగా నటనకు దూరంగా ఉన్న ఆమె.. ఆ తర్వాత గోవాలోని ఓ కాసినో క్లబ్లో మేనేజరుగా చేరారు. అయితే ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఆమెను చుట్టుముట్టాయి. వ్యాధిగ్రస్తురాలిగా కూడా మారడంతో.. ఉన్న డబ్బంతా ట్రీట్మెంట్ కోసమే ఖర్చయిపోయింది. ఇటీవలే ఓ మీడియా ద్వారా ఈ వార్త వెలుగులోకి వచ్చింది. పూజా మీడియా ద్వారా సల్మాన్‌కి ఓ సందేశం పంపించారు. ఆయన్ని కలవడానికి తాను చాలారోజులుగా ప్రయత్నిస్తున్నానని.. అయితే కుదరలేదని ఆమె తెలిపారు. చాలా దయనీయ స్థితిలో ఉన్న తనను కాపాడమని.. తనకు సహాయం చేయమని ఆమె సల్మాన్‌కి తెలిపారు.