Radha Madhavam: ‘రాధా మాధవం’ పోస్టర్‌ విడుదల.. కొత్త జానర్‌లో ప్రేమకథ

Radha Madhavam Movie Poster: విలేజ్ లవ్ బ్యాక్‌డ్రాప్‌లో దాసరి ఇస్సాకు  దర్శకత్వంలో రూపొందిన మూవీ రాధా మాధవం. వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ జంటగా నటించగా.. గోనాల్ వెంకటేష్ నిర్మించారు. తాజాగా డీపీఎస్ ఇన్‌ఫో టెక్ మేనేజింగ్ డైరెక్టర్ డా.డీఎస్ఎన్ రాజు చేతుల మీదుగా ఈ మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేయించారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 2, 2023, 03:37 PM IST
Radha Madhavam: ‘రాధా మాధవం’ పోస్టర్‌ విడుదల.. కొత్త జానర్‌లో ప్రేమకథ

Radha Madhavam Movie Poster: విలేజ్ లవ్ స్టోరీలు వెండితెరపై ఎన్నో అద్భుతాలు సృష్టించాయి. ఎన్ని కొత్త జానర్లు వచ్చినా ప్రేమ కథా చిత్రాలకు ప్రేక్షకుల అండ ఎప్పుడూ ఉంటుంది. తాజాగా మరో గ్రామీణ ప్రేమ కథా చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా దాసరి ఇస్సాకు డైరెక్షన్‌లో తెరకెక్కిన మూవీ ‘రాధా మాధవం. గోనాల్ వెంకటేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వసంత్ వెంకట్ బాలా కథ, మాటలు, పాటలను అందించారు. ప్రస్తుతం షూటింగ్ పార్ట్‌ కంప్లీట్ అవ్వగా.. త్వరలోనే ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు మూవీ మేకర్స్. 

ఈ నెలలో మూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. రిలీజ్ సమయం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్‌ కార్యక్రమాల్లో జోరు పెంచారు. ఇప్పటికే రాధ మాధవం ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి చేతుల మీదుగా విడుదల చేయించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ పోస్టర్‌ను డీపీఎస్ ఇన్‌ఫో టెక్ మేనేజింగ్ డైరెక్టర్ డా.డీ.ఎస్.ఎన్.రాజు రిలీజ్ చేశారు. చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ నెలలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

 

మేక రామకృష్ణ, జయ ప్రకాష్, ప్రియ, నవీన్, రవి శివతేజ, సుమన్, రాచర్ల లాస్య, ధనుష్ ఆచార్య, రాచర్ల మహేష్, శ్రీకాంత్ పర్కాల, సతీష్ కొల్లిపల్లి, శ్రీను, అడెపు మణిదీప్, చిరంజీవి, కామనగరి జ్యోతి, సురభి శ్యామల తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. మ్యూజిక్ చైతు కొల్లి అందించగా.. కెమెరామెన్‌గా తాజ్ జీడీకే వ్యవహరించారు. ఎడిటిండ్ బాధ్యతలు కె.రమేష్ నిర్వర్తించారు. ఫైట్స్‌ను రాబిన్ సుబ్బు కంపోజ్ చేశారు.

Also Read: OTT Release: సైలెంట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న పుష్ప విలన్ సినిమా

Also Read: Assembly Election 2023: తెలంగాణపై కాంగ్రెస్ వ్యూహం, ట్రబుల్ షూటర్ చేతికి బాధ్యతలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News