వాలెంటైన్స్ డే అనేది ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రేమికులు జరుపుకునే పర్వదినం. దీన్నే మనం ప్రేమికుల రోజుగా పిలుస్తున్నాం. ఈ రోజు తన మనసుకు నచ్చిన భాగస్వామికి వాలెంటైన్స్ కార్డులు పంపడం, పువ్వులు బహూకరించడం లేదా మిఠాయిలు ఇవ్వడం చేస్తుంటాం...అలాగే ప్రేమికులు ఒకరికి ఒకరు ఈ రోజున తమ ప్రేమను వ్యక్తపరుచుకోవడం సంప్రదాయంగా వస్తోంది. కాగా ఈ సంబరాల్లో మునిగి తేలుతున్న ప్రేమికులకు ప్రేమకు అర్థం చెప్పే ప్రయత్నం చేస్తూ రాసిన కవిత మీ కోసం....