10 Benefits Of Turmeric: పసుపును ఇలా నీళ్లలో కలిపి తీసుకుంటే.. ఒంట్లో ఉన్న చెడుకొవ్వు పోయి చర్మం మెరుస్తూ ఉంటుంది.

10 Benefits Of Turmeric: పసుపులో కర్కూమీన్‌ ఉంటుంది. ఇది చూడటానికి బంగారువర్ణంలో కనిపిస్తుంది. ఏళ్లుగా దీన్ని వినియోగిస్తున్నారు. ఇందులో ఔషధ గుణాలు పుష్కలం. మనదేశంలోనే కాదు పసుపును చైనీస్‌ మెడిసిన్‌లో కూడా ఉపయోగిస్తారు. ఇందులో పవర్‌ఫుల్‌ ఔషధ గుణాలు ఉంటాయి. పసుపును మన డైట్‌లో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం..

Written by - Renuka Godugu | Last Updated : Feb 20, 2025, 10:30 AM IST
10 Benefits Of Turmeric: పసుపును ఇలా నీళ్లలో కలిపి తీసుకుంటే.. ఒంట్లో ఉన్న చెడుకొవ్వు పోయి చర్మం మెరుస్తూ ఉంటుంది.

10 Benefits Of Turmeric: పసుపు యాంటీ బ్యాక్టిరియల్‌ గుణాలు కలిగి ఉంటుంది. దీన్ని రెగ్యులర్‌గా డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మెండు. పసుపును మనం కూరల్లో వాడతాం. ఇందులో యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ మైక్రోబ్రియల్‌ లక్షణాలు కూడా కలిగి ఉంటుంది. దీంతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. ఇది ఆక్సిడేటీవ్‌ స్ట్రెస్‌ నుంచి కాపాడుతుంది. ఫ్రీ రాడికల్‌ డ్యామేజ్‌ కాకుండా ప్రాణాంతక జబ్బుల నుంచి పసుపు కాపాడుతుంది. అంతేకాదు ఇది సెల్‌ డ్యామేజ్‌ కాకుండా నివారిస్తుంది. పసుపులో కర్కూమీన్‌ అనే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్‌ ఉంటుంది. ఇది ఆర్థరైటీస్‌, గుండె జబ్బులతోపాటు డయాబెటీస్‌ రాకుండా కాపాడుతుంది.

గుండె ఆరోగ్యాన్ని పసుపు కాపాడుతుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. బ్లడ్‌ ప్రెజర్‌ అదుపులో ఉంచుతుంది. ఇందులో ఉండే థెరపిటిక్‌ గుణాలు కార్డియో ఆరోగ్యాన్ని మెరుగు చేస్తాయి. 

అంతేకాదు పసుపును గాయలు మాన్చడానికి వినియోగిస్తాం. ఇందులో యాంటీ బ్యాక్టిరియల్‌, యాంటీ సెప్టిక్‌ గుణాలు కూడా ఉంటాయి. ఇవి గాయాలను త్వరగా మాన్పించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.

కీళ్లనొప్పులతో బాధపడేవారు పసుపు డైట్‌లో చేర్చుకోవాలి. ఇది నొప్పిని తగ్గించి ఆస్టియో ఆర్థరైటీస్‌, ర్యూమటాయిడ్‌ ఆర్థరైటీస్‌ రాకుండా నివారిస్తుంది. పసుపు ఇమ్యూనిటీ పనితీరును కూడా మెరుగు చేస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టిరియల్‌, యాంటీ వైరల్‌, యాంటీ ఫంగల్‌ లక్షణాలు ఉంటాయి.

పసుపును మన రెగ్యులర్‌ డైట్‌లో చేర్చుకుంటే జీర్ణ సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఇది కడుపులో గ్యాస్‌, అజీర్తికి చెక్‌ పెడుతుంది. అంతేకాదు ఆరోగ్యకరమైన పేగు కదలికకు పసుపు తోడ్పడుతుంది. మంచి బ్యాక్టిరియాను పెంచుతుంది.

ఇదీ చదవండి:  తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 14 గంటల సమయం..  

అంతేకాదు పసుపును రెగ్యులర్‌గా తీసుకుంటే మెదడు పనితీరును మెరుగు చేస్తుంది. ఇది మెదడు అభిజ్ఞా పనితీరుకు కూడా ప్రోత్సహిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ముఖ్యంగా డైప్‌ 2 డయాబెటీస్‌ వారికి ఇది మేలు చేస్తుంది. అంతేకాదు తరచూ పసుపు తీసుకోవడం వల్ల ఇది ముఖంపై ఉండే యాక్నేను కూడా తగ్గిస్తుంది. చర్మం ఆరోగ్యంగా మెరిపిస్తుంది.

పసుపు కేన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఇది కాలేయ పనితీరును కూడా మెరుగు చేస్తుంది. మంచి లివర్‌ డిటాక్సిఫైర్‌ కూడా. ఇది ఆక్సిడేటీవ్‌ స్ట్రెస్‌ నుంచి మన శరీరాన్ని కాపాడుతుంది. పసుపు సెరోటినిన్‌ ఉత్పత్తిని బూస్ట్‌ చేస్తుంది. డోపమైన్‌ స్థాయిలను కూడా పెంచడంలో సహాయపడుతుంది. దీంతో డిప్రెషన్‌, యాంగ్జైటీకి గురికాకుండా ఉంటారు.

ఇదీ చదవండి: సర్కారీ నౌకరీ మీ కల? రూ.180000 జీతం.. ఇలా వెంటనే దరఖాస్తు చేసుకోండి.  

పసుపుతో గోల్డెన్‌ మిల్క్‌ తయారు చేసుకోవచ్చు. పాలలో తేనె వేసుకుని కలపాలి. ఇందులో చిటికెడు పసుపు కలపాలి. దీంతో గోల్డెన్‌ మిల్క్‌ రెడీ అవుతుంది. ఇందులో కావాలంటే మీరు నల్ల మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. ఇది కాకుండా స్మూథీల్లో కూడా పసుపు వేసుకుని తీసుకోవచ్చు. సాధారణంగా మనం కర్రీలలో పసుపు వేసుకుంటాం లేదా సూప్స్‌, ఏదైన అన్నంతో తయారు చేసే రిసిపీల్లో కూడా పసుపు తప్పనిసరిగా తీసుకుంటాం. ఇవి కాకుండా మార్కెట్లో పసుపు సప్లిమెంట్స్‌ కూడా ఉంటాయి. ఇది ఆరోగ్య నిపుణులు సూచించినప్పుడు మాత్రమే వినియోగించాలి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News