Red Wine Benefits: మద్యం ఆరోగ్యానికి హానికరమే, కానీ రెడ్ వైన్ కాదంట, రెడ్ వైన్ ప్రయోజనాలు ఇవీ

Red Wine Benefits: మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ముమ్మాటికీ నిజమే. కానీ ఇందుకు రెడ్ వైన్ మినహాయింపు అంటున్నారు కొందరు . మితంగా తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. పూర్తి వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 4, 2023, 04:46 PM IST
Red Wine Benefits: మద్యం ఆరోగ్యానికి హానికరమే, కానీ రెడ్ వైన్ కాదంట, రెడ్ వైన్ ప్రయోజనాలు ఇవీ

Red Wine Benefits: మద్యపానం అనగానే ఎన్నో రకాలు. మరెన్నో బ్రాండ్లు. బ్రాండ్ల విషయం పక్కనబెడితే ఎన్నో రకాల ఆల్కహాలిక్ పానీయాలు అందుబాటులో ఉన్నాయి. బ్రాందీ, విస్కీ, స్కాచ్, వోడ్కా, రమ్, వైట్ రమ్, బీర్, వైన్, రెడ్ వైన్ ఇలా చాలానే ఉన్నాయి. అన్నింట్లో రెడ్ వైన్ కాస్త భిన్నమైందని అంటారు. ఎందుకో, ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

సాధారణంగా ఆల్కహాల్ అనేది ఆరోగ్యానికి మంచిది కానేకాదు. ఇదొక సామాజిక రుగ్మత మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా హానికరం. అందుకే మద్యపానం ఆరోగ్యానికి హానికరమనే బోర్డులు పెద్ద పెద్ద అక్షరాలతో చాలాచోట్ల దర్శనమిస్తూ ఉంటుంది. అయితే రెడ్ వైన్ అలా కాదంటారు. ఇది పులియబెట్టిన ద్రాక్షతో తయారయ్యే పానీయం. మితంగా రెడ్ వైన్ తాగడం ఆరోగ్యానికి మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.  ప్రతి రోజూ మితంగా రెడ్ వైన్ సేవిస్తుంటే...జీవితకాలం పెంపు, గుండెకు ఆరోగ్యం అన్నీ సాద్యమేనట. రెడ్ వైన్ వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందంటారు. అదే సమయంలో పరిమితి దాటితే మాత్రం అనర్ధాలు కలుగుతాయి. 

ప్రతిరోజూ రెడ్ వైన్ తాగడం వల్ల  చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది. ఇందులో ఉండే సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రిస్తాయి. రోజూ రెడ్ వైన్ తాగడం వల్ల డిప్రెషన్ సైతం తగ్గుతుంది. ఇది చాలా అద్యయనాల్లో వెల్లడైన వాస్తవమట. అంతేకాకుండా ప్రతి రోజూ తగిన పరిమాణంలో రెడ్ వైన్ తీసుకునే అలవాటుంటే ఆ వ్యక్తుల్లో జీవితకాలం పెరిగినట్టుగా పలు అధ్యయనాల్లో తేలింది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాదులు, సీజనల్ వ్యాధుల్నించి రక్షణ కల్పించేలా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

రెడ్ వైన్ రోజుకు తగిన పరిమాణంలో అంటే 200-250 మిల్లీలీటర్లు తాగే అలవాటుంటే ఆ వ్యక్తుల్లో చెడు కొలెస్ట్రాల్ స్థాయి గణనీయంగా తగ్గినట్టు పలు అధ్యయనాల్లో తేలిందంటున్నారు వైద్యులు. అయితే ఎక్కువగా తీసుకుంటే మాత్రం హాని కలుగుతుంది.  రెడ్ వైన్ తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాదుల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఎప్పుడైతే రెడ్ వైన్ కొలెస్ట్రాల్ తగ్గించగలుగుతుందో సహజంగానే గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లలో పోలీ ఫెనాల్స్ కారణంగా రక్త నాళాలు, గుండె ఆరోగ్యవంతంగా మారతాయి. రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది. 

రెడ్ వైన్ మితంగా రోజూ తీసుకుంటే చర్మం ఆరోగ్యవంతంగా మారుతుందంటారు. ఫలితంగా చర్మానికి నిగారింపు వచ్చి చేరుతుంది. ముఖ సౌందర్యం మెరుగుపడుతుంది. చాలామంది రంగు తేలుతారని నమ్ముతారు. 

Also read: How To Control High Bp: అధిక రక్తపోటు సులభంగా కంట్రోల్‌ చేసే సులభమై టిప్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News