Immunity Diet Plan: ఒమిక్రాన్ నియంత్రణ..రోగ నిరోధక శక్తిని పెంచే అతి ముఖ్యమైన ఆహార పదార్ధాలివే

Immunity: కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. ఒమిక్రాన్ సంక్రమణ వేగం పుంజుకుంది. ఈ నేపధ్యంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడమే అత్యుత్తమ మార్గంగా ఉంది. మీ రోగ నిరోధక శక్తిని పెంచేందుకు కావల్సిన అతి ముఖ్యమైన ఆహార పదార్ధాలేంటో చూద్దాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 9, 2022, 07:19 AM IST
Immunity Diet Plan: ఒమిక్రాన్ నియంత్రణ..రోగ నిరోధక శక్తిని పెంచే అతి ముఖ్యమైన ఆహార పదార్ధాలివే

Immunity: కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. ఒమిక్రాన్ సంక్రమణ వేగం పుంజుకుంది. ఈ నేపధ్యంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడమే అత్యుత్తమ మార్గంగా ఉంది. మీ రోగ నిరోధక శక్తిని పెంచేందుకు కావల్సిన అతి ముఖ్యమైన ఆహార పదార్ధాలేంటో చూద్దాం..

ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. కరోనా ఒక్కటే కాదు ఏ వ్యాధికైనా ఇది వర్తిస్తుంది. కోవిడ్ గైడ్‌లైన్స్ మాస్క్ ధారణ, భౌైతిక దూరం పాటించడం, చేతులు తరచూ కడుక్కోవడం, ఆరోగ్యకరమైన పదార్ధాలు తీసుకోవడం, ఫిట్నెస్ కాపాడుకోవడం వంటివి ఇన్‌ఫెక్షన్ నుంచి దూరం చేస్తాయి. వ్యాధి నిరోధకత బలంగా ఉంటే అతి వేగంగా సంక్రమించే ఒమిక్రాన్ వేరియంట్ నుంచి కూడా రక్షించుకోవచ్చు వైరస్ సోకిన సెల్స్‌ను నిర్మూలించి..మనల్ని రక్షించడంలో ఇమ్యూన్ ఆర్మీలోని టీ సెల్స్ కీలకపాత్ర పోషిస్తాయి. కోవిడ్ కొత్త స్ట్రెయిన్ ఒమిక్రాన్‌ను (Omicron Variant) ఎదుర్కోవడంతో వీటి సామర్ధ్యం చాలా ఎక్కువగా ఉందని తేలింది. 

మన శరీరంలోని రోగ నిరోధక శక్తిని (Immunity System ) బలోపేతం చేసేందుకు డైట్ ప్లాన్ అనేది చాలా ముఖ్యం. ఇంటి వంటతోపాటు ఫైబర్, విటమిన్ సి, మైక్రో న్యూట్రియంట్ల్ అధికంగా ఉండే ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ముఖ్యంగా నెయ్యి చాలా కీలకం. శరీరంలో అత్యంత సులంభంగా జీర్ణమయ్యే ఫ్యాట్ ఇది. ఇది శరీరంలో వేడిని పెంచి వెచ్చగా ఉండేలా చేస్తుంది. మీ రోజువారీ డైట్‌లో నెయ్యి చేర్చడం చాలా మంచిది.

ఇక సీజనల్‌గా లభించే ఉసిరికాయల్లో చాలా గొప్ప ఔషధ గుణాలున్నాయి. ముఖ్యంగా విటమిన్ సి  అంటేనే ఉసిరికాయ అని చెప్పుకోవచ్చు. రోగ నిరోధక శక్తిని (Immunity) స్ట్రాంగ్ చేయడంలో విటమిన్ సి కీలకం. అన్ని రకాల వ్యాధుల్ని, బలహీనతను దూరం చేస్తుంది. పచ్చి ఉసిరి లేదా ఉసిరి జ్యూస్ రోజూ తీసుకుంటే మంచిది. మరో ముఖ్యమైన ఆహార పదార్ధం మిల్లెట్స్. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. డయాబెటిక్స్ ఉన్నవారికి కూడా ఇది చాలా మంచిది. ఇది ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా బరువు తగ్గేందుకు కూడా ఉపయోగపడుతుంది. రాగి, బాజ్రా, జొన్నలు వంటి ఫైబర్ గుణాలున్న ఆహార పదార్ధాల్ని చేర్చడం వల్ల ముఖ్యంగా శీతాకాలంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. 

ఇక బెస్ట్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి..గొంతు గరగరకు అద్భుతంగా పనిచేసేది అల్లం. జెర్మ్స్, బ్యాక్టీరియా, వైరస్‌లను ఎదుర్కోవడంలో అల్లం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. డైలీ డైట్ ప్లాన్‌లో అంటే టీ లేదా కాడాలో తీసుకోవడం ద్వారా ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్‌గా చేసుకోవచ్చు. ఇక మరో ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగినది పసుపు. దగ్గు వంటి చాలా సమస్యల్నించి దూరం చేస్తుంది. ప్రతిరోజూ ఒక టీ స్పూన్ పుసుపుని..ఓ గ్లాసు గోరు వెచ్చని నీటిలో కలుపుకుని పరగడుపున తాగితే చాలా మంచిది. ఇక చివరిది తేనె. ఇది కల్గించే ప్రయోజనాలు చాలా ఎక్కువ. యాంటీ ఆక్సిడెంట్ (Anti Oxidant) గుణాలు అత్యధికంగా కలిగ జీర్ణక్రియ మెరుగుపడేందుకు తోడ్పడుతుంది. గొంతు సమస్యకు చాలా బాగా పనిచేస్తుంది. అల్లం టీ లేదా కాడాతో కలిపి తీసుకుంటే ఇంకా మంచిది. 

Also read: Covid 19 home testing : ఇంట్లోనే కోవిడ్ టెస్ట్.. ఈ సూత్రాలు పాటిస్తే చాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News