Weight Loss: నల్ల మిరియాలు రోజు ఇలా తీసుకుంటే బరువు తగ్గడమే, చెడు కొలెస్ట్రాల్ కూడా కరిగిపోవాల్సిందే..

Black Pepper For Weight Loss: నల్ల మిరియాలతో తయారుచేసిన ఆహారాలను ప్రతి రోజు తినడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే పోషకాలు శరీరాన్ని యాక్టివ్ గా ఉంచేందుకు ఎంతో సహాయపడతాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 18, 2023, 07:25 PM IST
Weight Loss: నల్ల మిరియాలు రోజు ఇలా తీసుకుంటే బరువు తగ్గడమే, చెడు కొలెస్ట్రాల్ కూడా కరిగిపోవాల్సిందే..

 

Black Pepper For Weight Loss: ప్రతి భారతీయుడు వంటగదిలో నల్ల మిరియాలు లభిస్తూ ఉంటాయి. వీటిని ఎన్నో వందల ఏళ్ల క్రితం నుంచి వంటల్లో వాడుకుంటూ వస్తున్నారు. నల్ల మిరియాలు ఆహారాలకు రుచిని అందించడమే కాకుండా శరీరానికి అనేక రకాల ప్రయోజనాలను కలిగిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇవి రుచికి ఎంతో ఘాటుగా ఉన్నప్పటికీ అనేక రకాల పోషక గుణాలు దాగి ఉంటాయి. ముఖ్యంగా తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు వీటిని ఆహారంలో క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా వీటిని తరచుగా ఆహారాల్లో తీసుకోవడం వల్ల శరీరానికి మరెన్నో లాభాలు కలుగుతాయి.. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

నల్ల మిరియాల్లో ఫైబ‌ర్, విట‌మిన్ కె, సి, ఎ, ఇ, బి అధిక పరిమాణంలో లభిస్తాయి. దీంతోపాటు పొటాషియం పరిమాణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి తరచుగా వీటిని ఆహారాల్లో వినియోగించడం వల్ల వృద్ధాప్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు తప్పకుండా ఆహారాల్లో వీటిని వినియోగించాల్సి ఉంటుంది. తరచుగా పొట్ట సమస్యలతో బాధపడే వారికి కూడా నల్ల మిరియాలు ప్రభావవంతంగా సహాయపడతాయి ఈ మిరియాలను కషాయంలా చేసుకొని తాగడం వల్ల రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది.

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

తరచుగా పొట్టనొప్పి, మలబద్ధకం, ఉబ్బరం, గ్యాస్ సమస్యలతో బాధపడే వారికి కూడా ఈ నల్ల మిరియాలు ఔషధంగా పనిచేస్తాయి. అంతేకాకుండా ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు కూడా ప్రభావంతంగా సహాయపడతాయి. తరచుగా బీపీ పెరగడం, తగ్గడం వంటి సమస్యలతో బాధపడే వారికి నల్లమిరియాలు గొప్ప ఉపశమనాన్ని అందిస్తాయి. ఇందులో ఉండే ఔషధ గుణాలు అధిక రక్తపోటు సమస్యలను నియంత్రించేందుకు ప్రభావవంతంగా సహాయపడతాయి.

అంతేకాకుండా అనారోగ్యకరమైన అలవాట్ల కారణంగా శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కూడా ఎంతో ప్రభావవంతంగా నల్ల మిరియాలు కరిగిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు తీసుకునే డైట్లో తప్పకుండా నల్లమిరియాలను వినియోగించాల్సి ఉంటుంది. అధిక బరువు సమస్యలతో బాధపడే వారికి కూడా నల్ల మిరియాలు మంచి ఫలితాలను అందిస్తాయి. అయితే ఈ నల్ల మిరియాలను టీలా తయారు చేసుకునే దాగడం వల్ల శరీర బరువుతో పాటు సులభంగా కొలెస్ట్రాల్ను కూడా కరిగించుకోవచ్చు.

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

Trending News