Black Tea Benefits: ఆధునిక దేశాల్లో బ్లాక్ టీ తాగేవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. చాలా మంది రోజులో రెండు నుంచి మూడు సార్లైనా తీసుకుంటున్నారు. నిజానికి ఉదయాన్నే బ్లాక్ టీని తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ముఖ్యంగా ఇందులో యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్ల అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఉదయం పూట ఈ బ్లాక్ టీని తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. దీంతో పాటు క్యాన్సర్ కణాలు కూడా తగ్గుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ప్రతి రోజు ఉదయం బ్లాక్ టీ తాగడం వల్ల ఇవే కాకుండా ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.
1. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
బ్లాక్ టీలో యాంటీఆక్సిడెంట్లు అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు తాగితే చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలు సులభంగా తగ్గుతాయి. దీంతో పాటు మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిలను పెంచడానికి సహాయపడతాయి. ఇది రక్త నాళాలను రక్షించడానికి, రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది ప్రతి రోజు తాగితే స్ట్రోక్ ప్రమాదం కూడా ఎంతో సులభంగా తగ్గుతుంది. ఇవే కాకుండా శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి.
2. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది:
బ్లాక్ టీలో ఉండే గుణాలు పాలీఫెనాల్స్ కణాలు దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి. దీంతో పాటు క్యాన్సర్ రాకుండా కూడా శరీరానికి సహాయపడుతుంది. అధ్యయనాల ప్రకారం బ్లాక్ టీ తాగడం వల్ల చర్మం, ప్రోస్టేట్, పొట్ట, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్‌ల ప్రమాదం తగ్గుతుందని పేర్కొన్నారు. దీంతో పాటు ఈ బ్లాక్ టీలో ఉండే గుణాలు ఇతర అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
3. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
బ్లాక్ టీలోని సహజ సమ్మేళనాలు జీర్ణ ప్రక్రియను మెరుగుపరచడానికి, మలబద్ధకాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. కొన్ని అధ్యయనాలు బ్లాక్ టీ ప్రేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడానికి సహాయపడుతుందని సూచిస్తున్నాయి. దీంతో పాటు ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల పొట్ట సమస్యలను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.
4. రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
బ్లాక్ టీలోని యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి, శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడానికి సహాయపడతాయి. అధ్యయనాలు బ్లాక్ టీ తాగడం వల్ల జలుబు, ఫ్లూ వంటి సాధారణ ఇన్ఫెక్షన్ల ప్రమాదం తగ్గుతుందని సూచిస్తున్నాయి. ఇవే కాకుండా తరచుగా ఈ టీని తాగడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
5. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది:
బ్లాక్ టీలోని కాఫీన్ మెదడు పనితీరును మెరుగుపరచడానికి, ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ టీ తాగితే మెదడులోని కణాలు కూడా ఎంతగానో మెరుగుపడతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి