Causes Of Chest Pain: గత కొన్ని ఏళ్ల కాలం నుంచి జీవనశైలిలో తీవ్ర మార్కులు వస్తున్నాయి. దీని కారణంగా మనుషులు ఆరోగ్యానికి కంటే డబ్బుకు ఎక్కువగా విలువిచ్చి కంప్యూటర్ల ముందు ఎక్కువగా కూర్చుని పనులు చేస్తున్నారు. మరికొందరైతే తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. అంతేకాకుండా తీవ్ర నొప్పుల బారిన కూడా పడుతున్నారు. అయితే కొందరిలో ఎక్కువగా కూర్చుని పనులు చేయడం వల్ల ఛాతిలో నొప్పులు కూడా వస్తున్నాయి. ఇలా కూర్చుని తరచుగా పనులు చేయడం కారణంగా తేలికపాటి ఛాతి నొప్పులు వస్తున్నాయి.
ఈ ఛాతి నొప్పులతో బాధపడుతున్న వారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది లేకపోతే తీవ్ర గుండె సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. చాలామందిలో ఛాతి నొప్పుల కారణంగా గుండెపోటు సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యల బారిన పడకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: Hyundai Cars Discount & Offers: ఈ 3 హ్యుందాయ్ కార్లపై బంపర్ ఆఫర్.. చివరి తేదీకి ముందే కోనేసేయండి!
ఛాతీ నొప్పి రావడానికి కారణాలు:
ఆక్సిజన్ పరిమాణాలు తగ్గడం:
ప్రస్తుతం చాలామంది కంప్యూటర్ల ముందు గంటల తరబడి పనులు చేస్తూ ఉంటారు. ఇలాంటి క్రమంలో శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. దీంతో ఛాతిపై తీవ్ర ప్రభావం పడుతుంది. కాబట్టి కంప్యూటర్ల ముందు గంటల తరబడి పనులు చేయకుండా గంటకు ఐదు నిమిషాల పాటు రెస్ట్ తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
కండరాల నొప్పి:
ఊపిరితిత్తుల్లో సమస్యలు రావడం వల్ల కూడా కండరాలలో నొప్పి ఏర్పడి ఛాతీ నొప్పులకు దారితీస్తుంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో పొత్తికడుపు నొప్పి కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడేవారు ఆరోగ్యం పై ప్రత్యేక జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
గుండెపోటు:
చాటి నొప్పి వచ్చినప్పుడు గుండెకు రక్తప్రసరణ ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాతి నొప్పితో బాధపడుతున్న వారు తప్పకుండా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. లేకపోతే గుండెపోటుతో పాటు చాలా రకాల దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొందరిలో ఇలాంటి నొప్పులే కాకుండా రక్తం గడ్డ కట్టే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: Hyundai Cars Discount & Offers: ఈ 3 హ్యుందాయ్ కార్లపై బంపర్ ఆఫర్.. చివరి తేదీకి ముందే కోనేసేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.