KPHB Colony Lands Auction: హైదరాబాద్‌లో అత్యంత కీలక ప్రాంతంగా ఉన్న కేపీహెచ్‌బీ కాలనీకి గండం వచ్చి పడింది. ఇక్కడి స్థలాలను కాంగ్రెస్ ప్రభుత్వం వేలానికి సిద్ధమవడంతో స్థానిక ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై అక్కడి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌసింగ్ బోర్డు స్థలాలు ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని ఇది కుదరదని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ సందర్భంగా స్థానికులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు.
Also Read: DK Aruna: 'రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కుట్రలు చేసినా ఢిల్లీ పీఠం మాదే'
ఏం జరిగింది?
హైదరాబాద్‌లో ఒకప్పుడు శివారు ప్రాంతంగా ఉన్న కేపీహెచ్‌బీ కాలనీ ఇప్పుడు నగరం మధ్యలోకి వచ్చేసింది. ఈ కాలనీలో హౌసింగ్ బోర్డు స్థలాలు ఇంకా ఉన్నాయి. తాజాగా ఈ స్థలాలకు సంబంధించి ప్రభుత్వం వేలం వేసేందుకు ప్రకటన జారీ చేసిందనే వార్త కేపీహెచ్‌బీ కాలనీలో కలకలం రేపుతోంది. ఈ కాలనీ స్థలాలను ప్రభుత్వం వేలం వేయడాన్ని కాలనీవాసులు తప్పుబడుతున్నారు. ఈ భూముల వేలం సరికాదని నిరసన వ్యక్తం చేశారు.
Also Read:"Telangana By Poll: త్వరలో తెలంగాణలో ఎన్నికలు? కేటీఆర్ వ్యాఖ్యల వెనుక పరమార్థం ఇదే!
కాలనీవాసుల ఆగ్రహం
ఈ ప్రకటన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీకి గండం వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. హౌసింగ్ బోర్డ్‌కు సంబంధించి స్థలాలను బహిరంగ వేలానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం కావడం సరికాదన్నారు. కాలనీకి సంబంధించిన 3 గజాల నుంచి 300 గజాలకు పైగా స్థలాలను అమ్మేందుకు ప్రకటన జారీ చేసిందని తెలిపారు.
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం
'హౌసింగ్ బోర్డు స్థలాలకు సంబంధించి ఆరు గజాలు, మూడు గజాలు, 50 గజాలకు సంబంధించిన స్థలాలను ప్రభుత్వం అమ్ముకోవడం సరికాదు' అని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తప్పుబట్టారు. ప్రజలకు సంబంధించిన స్థలాలను ప్రభుత్వం అమ్మడం హేయమైన చర్య అని.. వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రయోజనాల కోసం వదిలేసిన స్థలాలను వేలం వేయడం ద్వారా వచ్చే సొమ్మును ప్రభుత్వం తీసుకోవాలని భావిస్తోందని వివరించారు. ప్రభుత్వ వేలంపాటలో పాల్గొనే వారికి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హెచ్చరిక జారీ చేశారు. 'వేలంలో దక్కించుకున్న స్థలాలలో నిర్మాణాలను ఎట్టి పరిస్థితిలో అనుమతించం. వాటిని అడ్డుకునేందుకు కాలనీవాసులంతా సిద్ధంగా ఉన్నాం' అని ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.