Cholesterol Tips: చెడు కొలెస్ట్రాల్ పెరుగుతోందా..ఈ ఆహార పదార్ధాలు తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు

Cholesterol Tips: కొలెస్ట్రాల్ చాలా ప్రమాదకరం. ఇందులో ఎల్‌డిఎల్ గుండె జబ్బులకు దారి తీసి..ప్రాణాంతకమవుతుంది. అయితే కొన్ని రకాల ఆహార పదార్ధాల్ని మీ రెగ్యులర్ డైట్‌లో చేర్చుకుంటే..బ్యాడ్ కొలెస్ట్రాల్ దూరం చేసుకోవచ్చంటున్నారు వైద్యులు. అవేంటో చూద్దాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 29, 2022, 10:04 AM IST
Cholesterol Tips: చెడు కొలెస్ట్రాల్ పెరుగుతోందా..ఈ ఆహార పదార్ధాలు తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు

Cholesterol Tips: కొలెస్ట్రాల్ చాలా ప్రమాదకరం. ఇందులో ఎల్‌డిఎల్ గుండె జబ్బులకు దారి తీసి..ప్రాణాంతకమవుతుంది. అయితే కొన్ని రకాల ఆహార పదార్ధాల్ని మీ రెగ్యులర్ డైట్‌లో చేర్చుకుంటే..బ్యాడ్ కొలెస్ట్రాల్ దూరం చేసుకోవచ్చంటున్నారు వైద్యులు. అవేంటో చూద్దాం.

మనిషి శరీరానికి గుడ్ కొలెస్ట్రాల్ ఎంత మంచిదో..బ్యాడ్ కొలెస్ట్రాల్ అంత ప్రమాదకరం. ఎల్‌డి‌ఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, హెచ్‌డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్. గుండె జబ్బులతో పాటు ఇతర వ్యాధులకు దారి తీస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్. ఈ తరుణంలో హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు కొన్ని రకాల ఆహార పదార్ధాల జాబితా విడుదల చేశారు. ఈ ఆహార పదార్ధాలు కొవ్వును కరిగించడమే కాకుండా మీ గుండెను పదికాలాలపాటు పదిలంగా ఉంచుకోవచ్చంటున్నారు. 

ఎల్‌డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించే ఆహార పదార్ధాలు

కూరగాయలు అధికంగా తీసుకుంటే వాటిలో ఉండే ఫైబర్ శరీరానికి చాలా శక్తిని ఇస్తుంది. శరీరంలోని చెడు కొవ్వును కరిగిస్తుంది. వంకాయ, బెండకాయలో అధికంగా ఉండే ఫైబర్..కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. బ్రకోలి, చిలకడదుంప కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. రెండవది నట్స్, తృణ ధాన్యాలు. వీటిని ప్రతి నిత్యం తీసుకోవడం వల్ల ఎల్‌డీఎల్‌ను తగ్గించవచ్చు. నట్స్‌లో ఉండే ప్రోటీన్ రక్తంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. తృణధాన్యాల్లో ఉండే ఫైబర్ కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఓట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఓట్స్‌లో అధికంగా ఉండే ఫైబర్ బీటా గ్లూకాన్ రూపంలో ఉంటుంది. ఆకలిని తగ్గించడమే కాకుండా కొవ్వును కరిగిస్తుంది. 

బరువు కూడా తగ్గిస్తాయి

త్వరగా ఆకలి వేయకుండా ఉండేందుకు బీన్స్‌ను ఆహారంగా తీసుకోండి. ఇందులో ఉండే హై ప్రోటీన్స్ కారణంగా త్వరగా ఆకలి వేయదు. బీన్స్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా బరువు తగ్గించుకోవచ్చు. ఇక వెజిటబుల్ ఆయిల్స్ విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. వెజిటబుల్ ఆయిల్స్‌లో అంతగా కొలెస్ట్రాల్ ఉండదు. ఇందులో ఉండే విటమిన్ ఇ, కేలు చెడు కొవ్వును నియంత్రిస్తాయి. ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ ఉన్న చేపల్ని తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ వేగంగా తగ్గించుకోవచ్చు. ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ వల్ల గుండె జబ్బులు కూడా తగ్గుతాయి.

ఇక సోయా బీన్స్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు మంచి ఫుడ్. ప్రతి రోజూ సోయా ఉత్పత్తుల్ని తీసుకోవడం వల్ల ఎల్‌డీఎల్ తగ్గుతుంది. సాచ్యురేటెడ్ ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. ఈ ఆహార పదార్ధాలతో పాటు ఫైబర్ సప్లిమెంట్స్ తీసుకుంటే మన శరీరంలో సాల్యుబుల్ ఫైబర్ పెరుగుతుంది. మీరు ప్రతిరోజూ తినే ఆహారంలో ఈ ఆహార పదార్ధాలు తీసుకుంటే..మీ శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ స్థాయి కచ్చితంగా తగ్గుతుంది. దీంతో పాటు క్రమం తప్పకుండా వాకింగ్ లేదా యోగా అలవాటు చేసుకోవాలి. 

Also read: Morning Walk Side Effects: మార్నింగ్‌ వాక్‌ చేసే సమయంలో మొబైల్ ఫోన్ వాడుతున్నారా..అయితే ఈ విషయాలను తెలుసుకోడి.!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News