ఎందుకంటే ప్రస్తుతం సర్వ సాధారణంగా మారిన ఈ కొలెస్ట్రాల్ చాలా ప్రమాదకరం. అప్రమత్తంగా ఉంటే ఎంత సులభంగా నియంత్రించుకోవచ్చో..నిర్లక్ష్యం ప్రదర్శిస్తే అంత ప్రమాదకరమౌతుంది. అయితే కొన్ని రకాల ఆహార పదార్ధాలతో శరీరంలో పేరుకున్న చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేయవచ్చు.
మనిషి శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. గుడ్ కొలెస్ట్రాల్ ఎంత మంచిదో..బ్యాడ్ కొలెస్ట్రాల్ అంత ప్రమాదకరం. ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, హెచ్‌డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్. గుండె జబ్బులతో పాటు ఇతర వ్యాధులకు దారి తీస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్. గుడ్ కొలెస్ట్రాల్ అనేది శరీరంలోని కణజాలాల నిర్మాణానికి తోడ్పడుతుంది. అదే బ్యాడ్ కొలెస్ట్రాల్ రక్త సరఫరాలో ఆటంకాలు కల్గిస్తుంది. అందుకే ఇది ప్రమాదకరం. ప్రముఖ హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు కొలెస్ట్రాల్ నియంత్రణకు కొన్ని రకాల ఆహార పదార్ధాల జాబితా విడుదల చేశారు. ఈ ఆహార పదార్ధాలు కొవ్వును కరిగించడమే కాకుండా మీ గుండెను పదికాలాలపాటు పదిలంగా ఉంచడంలో దోహదపడతాయి.
ఎల్డిఎల్ తగ్గించే ఆహార పదార్ధాలు
కొలెస్ట్రాల్ తగ్గించాలంటే ఎక్కువగా కూరగాయలపై ఆధారపడాలి. కూరగాయలు ఎంత ఎక్కువగా తీసుకుంటే కొలెస్ట్రాల్ అంత సులభంగా నియంత్రించవచ్చు. ఇందులో ఉండే ఫైబర్ శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా..జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గించేందుకు కూరగాయలు అద్భుతంగా ఉపయోగపడతాయి. వంకాయ, బెండకాయలో అధికంగా ఉండే ఫైబర్..కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. బ్రకోలి, చిలకడదుంప కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.
ఇక సోయా బీన్స్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు అద్భుతంగా ఉపయోగపడుతాయి. ప్రతి రోజూ సోయా ఉత్పత్తుల్ని తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. ఇందులో శాచ్యురేటెడ్ ఫ్యాట్ తక్కువగా ఉండి..ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుంది. ఈ ఆహార పదార్ధాలతో పాటు ఫైబర్ సప్లిమెంట్స్ తీసుకుంటే మన శరీరంలో సాల్యుబుల్ ఫైబర్ పెరుగుతుంది. మీరు ప్రతిరోజూ తినే ఆహారంలో ఈ ఆహార పదార్ధాలు తీసుకుంటే..మీ శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ స్థాయి కచ్చితంగా తగ్గుతుంది.
ఇక రెండవది నట్స్, తృణ ధాన్యాలు. వీటిని ప్రతి నిత్యం తీసుకోవడం వల్ల ఎల్‌డీఎల్‌ను సులభంగా తగ్గించవచ్చు. నట్స్‌లో ఉండే ప్రోటీన్ రక్తంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. తృణధాన్యాల్లో ఉండే ఫైబర్ కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఓట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఓట్స్‌లో అధికంగా ఉండే ఫైబర్ బీటా గ్లూకాన్ రూపంలో ఉంటుంది. ఆకలిని తగ్గించడమే కాకుండా కొవ్వును కరిగిస్తుంది.
స్థూలకాయానికి చెక్
స్థూలకాయం అదుపు చేసేందుకు బీన్స్‌ను ఆహారంగా తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. ఇందులో ఉండే హై ప్రోటీన్స్ కారణంగా త్వరగా ఆకలి వేయదు. బీన్స్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా బరువు తగ్గించుకోవచ్చు. ఇక వెజిటబుల్ ఆయిల్స్ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. వెజిటబుల్ ఆయిల్స్‌లో అంతగా కొలెస్ట్రాల్ ఉండదు. ఇందులో ఉండే విటమిన్ ఇ, కే చెడు కొవ్వును నియంత్రిస్తాయి. ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ ఉన్న చేపల్ని తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ వేగంగా తగ్గించవచ్చు. ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ వల్ల గుండె జబ్బులు కూడా తగ్గుతాయి.
Also read: Bone Health: డైట్లో ఈ పదార్ధాలుంటే వయస్సు 60 దాటినా ఫిట్ అండ్ స్లిమ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook