Dehydration Symptoms On Skin: శరీరంలో నీరు కొరతగా ఉంటే ఈ చర్మ సమస్యలు తప్పవు..!

Dehydration Symptoms On Skin: శరీరంలో నీటి శాతం తగ్గితే.. అనేక వ్యాధులు ఉత్పన్నమవుతున్నాయి. అంతేకాకుండా అలసట, తల తిరగడం, నోరు పొడిబారడం వంటి లక్షణాలు వచ్చే అవకాశాలున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 18, 2022, 09:28 AM IST
  • శరీరంలో నీరు కొరతగా ఉంటే పలు రకాల సమస్యలు వస్తాయి
  • చర్మం పొడి బారడం, చర్మంపై దురద..
  • వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి
Dehydration Symptoms On Skin: శరీరంలో నీరు కొరతగా ఉంటే ఈ చర్మ సమస్యలు తప్పవు..!

Dehydration Symptoms On Skin: శరీరంలో నీటి శాతం తగ్గితే.. అనేక వ్యాధులు ఉత్పన్నమవుతున్నాయి. అంతేకాకుండా అలసట, తల తిరగడం, నోరు పొడిబారడం వంటి లక్షణాలు వచ్చే అవకాశాలున్నాయి. శరీరంలో నీరు శాతం తగ్గిపోతే వీటి ప్రభావం జుట్టు, చర్మంపై కూడా కనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. చర్మంలోనైతే.. ముడతలు రావడం వంటి సమస్యలు వస్తాయని వారు పేర్కొన్నారు. అయితే ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి నీరు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. నీటీని అధిక మోతాదులో తీసుకోకపోతే శరీరంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయో తెలుసుకుందాం..

శరీరంలో నీరు లేక పోతే ఇలాంటి సమస్యలు వస్తాయి:

చర్మం పొడి బారడం:

ప్రస్తుతం చాలా మంది చర్మం పొడిబారడం సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు ముఖ్య కారణం తగినంత శరీరంలో నీటి శాతం లేకపోయినందునేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. శరీరంలో నీరు తగ్గిపోయి  చర్మం డీహైడ్రేషన్‌కు గురవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

లిప్స్‌ క్రస్టింగ్:

పెదవులపై స్కాబ్లింగ్ కూడా డీహైడ్రేషన్ చర్మం యొక్క లక్షణం. శరీరంలో నీటి కొరత కారణంగా..పెదవులపై చర్మం చనిపోయి కణాలు గడ్డకట్టి వివిధ రకాల పెదవుల సమస్యలు వస్తాయి. అంతేకాకుండా శరీరంలో నీరు లేకపోవడం వల్ల కూడా పెదవుల పగుళ్లు ఏర్పడతాయి.

చర్మంపై దురద:

చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. నీటి కొరత కారణంగా..  చర్మంపై దురద, చర్మం ఎరుపు రంగులోకి మారడం వంటి సమస్యలు వస్తుంటాయి. దీనితో పాటు చర్మంపై దద్దుర్ల సమస్య కూడా ఉత్పన్నమవుతాయి.

ముడతలు:

వయసు పెరిగేకొద్దీ ముఖం, చేతులపై ముడతలు రావడం సాధరణం.  చిన్నతనంలోనే ముఖంపై ముడతలు వస్తే అది శరీరంలో నీటి కోరతేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Tulsi Uses And Benefits: తులసి మొక్క తరుచుగా ఎండిపోతుందా.. అయితే ఇలా చేయండి..!

Also Read: Secunderabad Agnipath Protests: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అల్లకల్లోలం.. అంతా ప్రీ-ప్లాన్డ్‌ గానే జరిగిందా..?

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News