Can Control Diabetes with these Tips In 2 Days: దేశవ్యాప్తంగా మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య రోజుకు పెరిగిపోతుంది. దీని కారణంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాకుండా ఆహార నియమాలు పాటించకపోవడంతో మధుమేహం హెచ్చుతగ్గులవుతుంది. దీని కారణంగా కూడా ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అయితే ఆధునిక జీవనశైలితో పాటు రోజు చేసే పనుల్లో మార్పులు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల పద్మహాన్ని నియంత్రించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన సలహాలు సూచనలు పాటించడం కూడా చాలా మంచిది.
డయాబెటిస్ నియంత్రణకు ఈ చిట్కాలు తప్పనిసరి:
ఉదయాన్నే షుగర్ లెవెల్స్ ను పరీక్షించుకోవాల్సింది:
రాత్రి పడుకునే ముందు చాలామంది అనారోగ్యకరమైన ఆహారాలతో పాటు పలు డ్రింక్స్ తీసుకుంటున్నారు. దీని ప్రభావం మధుమేహం పై పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే రక్తంలోని చక్కెర పరిమాణాలను పరీక్షించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ చక్కెర పరిమాణాలు అధికంగా ఉంటే నియంత్రణ చర్యలు పాటించాల్సి ఉంటుంది.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం:
బ్లడ్ లోని షుగర్ లెవెల్స్ అనేది మనం తీసుకునే ఆహారాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. ఒకవేళ అనారోగ్యకరమైన ఆహారాలను అతిగా తీసుకుంటే అవి రక్తంలోని చక్కెర పరిమాణాలపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్న వారు ఎప్పుడు ఆరోగ్యకరమైన ఆహారాలను మాత్రమే తినాల్సి ఉంటుంది.
వ్యాయామాలు తప్పనిసరి:
వ్యాయామాలు చేయడం వల్ల శరీరం దృఢంగా ఆరోగ్యవంతంగా తయారవుతుంది. అందుకే ఆరోగ్య నిపుణులు ప్రతిరోజు వ్యాయామాలు చేయాలని సూచిస్తూ ఉంటారు. మధుమేహంతో బాధపడుతున్న వారు కూడా ప్రతిరోజు తప్పకుండా వ్యాయామం చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలతో పాటు రక్తంలోని చక్కర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్న వారు తప్పకుండా 30 నిమిషాల పాటు వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది.
ఒత్తిడికి దూరంగా ఉండడం చాలా మంచిది:
ఒత్తిడి కారణంగా దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒత్తిడిని తగ్గించుకుంటే చాలా మంచిది.. మధుమేహం కూడా ఒత్తిడి పైనే ఆధారపడి ఉంటుంది ఒత్తిడి పెరిగితే షుగర్ లెవెల్స్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒత్తిడి తగ్గించుకోవడం చాలా మంచిది.
Also Read: Bathukamma 2022: బతుకమ్మ పండుగను పూర్వికులు ఇలా జరుపుకునే వారట.. మరి మీరు ఎలా జరుపుకుంటున్నారు..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Control Diabetes in 2 Days: ఈ నియమాలు పాటిస్తే చాలు.. జీవితంలో డయాబెటిస్ రాదు.. ఉన్న వారికి 2 రోజుల్లో దిగి రావడం ఖాయం!