Diabetes Control With Oats Roti: ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతదేశంలో రోటీలను ప్రధాన ఆహారంగా తీసుకుంటారు. అంతేకాకుండా భారత్ వ్యాప్తంగా గోధుమ పిండి రొట్టెలను చేసుకోవడం విశేషం. అయితే ప్రస్తుతం చాలామంది మధుమేహం బారిన పడుతున్నారు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి వివిధ రకాల ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఈ నియమాల్లో భాగంగా పిండితో చేసిన రొట్టెలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణం తగ్గుతుందని.. దీంతో మధుమేహం నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఆహార నియమాల్లో భాగంగా రొట్టెలు, బ్రెడ్స్ తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. అయితే ఆరోగ్య నిపుణులు పలు రకాల పిండిలతో చేసిన రొట్టెలను తీసుకోవాలని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఓట్స్ పిండితో తయారుచేసిన రోటీలు:
మధుమేహం వ్యాధిగ్రస్తులు గోధుమపిండితో తయారుచేసిన రోటీలను కేవలం అప్పుడప్పుడు మాత్రమే తీసుకోవాలి. ఇందులో కార్బోహైడ్రేట్ల పరిమాణం ఎక్కువగా ఉండటం వల్ల ఇది వ్యాధిని మరింత రెట్టింపు చేసే అవకాశాలున్నాయి. అయితే రోటీలను తీసుకునే క్రమంలో గోధుమపిండి రోటీలకు బదులు.. ఓట్స్ పిండితో తయారుచేసిన రోటీలను తీసుకోవడం చాలా మేలని నిపుణులు సూచిస్తున్నారు.
ఓట్స్ మధుమేహం వ్యాధిగ్రస్తులకు ఎందుకు బెస్ట్:
ఓట్స్ లో క్యాలరీల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఓట్స్ లో పోషకాలు ఫైబర్ అధిక పరిమాణంలో ఉంటాయి. కాబట్టి మధుమేహం వ్యాధిగ్రస్తులు వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. రక్తంలో చక్కర పరిమాణాలు కూడా తగ్గుతాయి. కాబట్టి డయాబెటిస్తో బాధపడుతున్న వారు తప్పకుండా తయారుచేసిన రోటీలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఓట్స్ రోటీలను ఎలా తయారు చేయాలి?
ఓట్స్ మొదటిసారి తిన్నప్పుడు అందరికీ నచ్చకపోవచ్చు. కానీ ఇందులో శరీరాన్ని కావలసిన చాలా రకాల మూలకాలు ఉంటాయి. అయితే ఓట్స్ రోటీలను తయారు చేయడానికి ముందుగా.. ఓట్స్‌ను పిండిలా చేసి అందులో తగినంత ఉప్పు వేసి నీటితో కలుపుకోవాలి. ఆ తర్వాత వాటిని పెనంపై కాల్చుకొని ఆహారంగా తీసుకోవచ్చు. డయాబెటిస్తో బాధపడేవారు ఇలా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
Also Read:Weight Loss: బరువు తగ్గే క్రమంలో ఈ నియమాలు పాటించండి.. కేవలం 11 రోజుల్లో బరువు తగ్గడం ఖాయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok