టీ లేదా కాఫీ చాలామంది ఇష్టంగా తాగుతుంటారు. కొందరైతే రోజుకు 5-8 టీలు కూడా తాగుతుంటారు. అదే సమయంలో టీ , కాఫీలు తాగేముందు నీళ్లు తాగుతుంటారు. ఈ అలవాటు మంచిదా కాదా అనే విషయంపై ఇప్పుడు వివరాలు పరిశీలిద్దాం.
టీ, కాఫీ తాగేముందు నీళ్లు తాగడం మంచిదని కొందరు, మంచిది కాదని మరి కొందరు అభిప్రాయపడుతుంటారు. టీ, కాఫీ కంటే ముందు నీళ్లు తాగడం మంచిదా కాదా అనేది తెలుసుకుందాం. టీ, కాఫీలో కెఫీన్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి నష్టం కల్గిస్తుంది. అందుకే టీ, కాఫీ తాగేముందు నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది. టా, కాఫీ కంటే ముందు నీళ్లు తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మీకు రోజూ ఉదయం, సాయంత్రం టీ-కాఫీ తాగే అలవాటుంటే..అంతకంటే 15 నిమిషాల ముందు నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ అలవాటు చాలా వ్యాధుల్నించి శరీరానికి సంరక్షణ ఇస్తుంది.
టీ, కాఫీ తాగడం వల్ల పళ్లు పాడవుతాయనే భయముంటుంది. ఇందులో ట్యానిన్ పేరున్న పోషక పదార్ధాలుంటాయి ఇవి పళ్ల రంగును దెబ్బతీస్తాయి. అందుకే ముందు నీళ్లు తాగడం వల్ల పళ్లకు హాని చేకూరదు. ఎందుకంటే నీళ్లు పళ్లకు ఓ రక్షణ కవచాన్ని ఏర్పరుస్తాయి.
పరగడుపున టీ, కాఫీ తాగడం వల్ల చాలామందికి ఎసిడిటీ సమస్య ఉంటుంది. ఎసిడిటీ కడుపుకు హాని కల్గిస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు టీ, కాఫీ కంటే 15 నిమిషాల ముందు నీళ్లు తాగడం మంచిది. దీనివల్ల అల్సర్ సమస్య నుంచి కూడా విముక్తి పొందవచ్చు.
డీహైడ్రేషన్ నుంచి రక్షణ
పరగడుపున టీ, కాఫీ తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య ఉత్పన్నం కావచ్చు. డీహైడ్రేషన్ చాలా వ్యాధులకు కారణమౌతుంది. టీ, కాఫీ కంటే ముందు నీళ్లు తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య తలెత్తదు. శరీరంలో న్యూట్రియంట్ల లోపం కూడా ఏర్పడదు.
Also read: Winter Diet Tips: ఆ నాలుగు ఆకుకూరల్లో మినరల్స్, విటమిన్స్ పుష్కలం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook