Weight Loss And Diabetes: ఈ రసంతో మధుమేహం, శరీర బరువుకు 7 రోజుల్లో చెక్‌!

Bitter melon For Weight Loss And Diabetes: కాకరకాయ రసం ప్రతి రోజూ తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.  ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్‌ అధిక పరిమాణంలో ఉండడం వల్ల సులభంగా శరీర బరువును కూడా తగ్గిస్తాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 29, 2023, 02:52 PM IST
Weight Loss And Diabetes: ఈ రసంతో మధుమేహం, శరీర బరువుకు 7 రోజుల్లో చెక్‌!

Bitter melon For Weight Loss And Diabetes: కాకరకాయ శరీరానికి చాలా మేలు చేస్తుంది. అయితే దీనితో తయారు చేసిన రసాన్ని ప్రతి రోజూ తాగడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే ఇందులో మీ శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్స్‌ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి కాకరకాయతో తయారు చేసిన జ్యూస్‌ని తాగడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.  కాకర రసం తాగడం వల్ల ఇతర లాభాలు కూడా కలుగుతాయి. అయితే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కాకరకాయ రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాల:
రోగనిరోధక శక్తి బలంగా మారుతుంది:

కాకరకాయలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి కీలక పాత్ర పోషిస్తుంది.  ఖాళీ కడుపుతో ప్రతి రోజూ కాకర రసం తాగడం వల్ల సీజన్‌ మారడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.

డయాబెటిస్‌ ఉన్నవారికి ప్రభావవంతంగా సహాయపడుతుంది:
మధుమేహంతో బాధపడుతున్నవారికి ప్రభావవంతంగా సహాయపడుతుంది. కాకర రసం ప్రతి రోజూ తాగడం వల్ల రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. ఈ జ్యూస్‌లో హైపోగ్లైసీమిక్ గుణాలు లభిస్తాయి. కాబట్టి సులభంగా రక్తంలోని చక్కెరను అదుపులో ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.  

జీర్ణవ్యవస్థను దృఢంగా చేస్తుంది:
కాకర రసం ఖాళీ కడుపుతో తాగడం వల్ల జీర్ణవ్యవస్థ బలంగా మారుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే ఫైబర్‌ పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో ఉండే గుణాలు జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది.

బరువు అదుపులో ఉంచుతుంది:
బరువు తగ్గాలనుకునేవారు డైట్‌లో భాగంగా ఖాళీ కడుపుతో ఈ రసాన్ని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో ఆకలిని నియంత్రించే చాలా రకాల మూలకాలు ఉంటాయి. దీంతో సులభంగా కొలెస్ట్రాల్‌ కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also read: AP 10th Exams: పదవ తరగతి పరీక్షకు అంతా సిద్ధం, ఏప్రిల్ నెలాఖరులోనే ఫలితాలు

Also read: AP 10th Exams: పదవ తరగతి పరీక్షకు అంతా సిద్ధం, ఏప్రిల్ నెలాఖరులోనే ఫలితాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News