Green Apple Benefits: గ్రీన్ ఆపిల్ రోజూ తింటే..లివర్, లంగ్స్ సమస్యలు దూరం

Green Apple Benefits: యాపిల్ ఎ డే..కీప్స్ డాక్టర్ ఎవే అనేది అందరికీ తెలిసిందే. కానీ గ్రీన్ ఆపిల్ ప్రయోజనాలు ఇంతకంటే ఎక్కువ. రోజూ డైట్‌లో భాగంగా చేసుకుంటే అనేక వ్యాధుల్నించి ఉపశమనం పొందవచ్చు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 15, 2022, 06:30 PM IST
Green Apple Benefits: గ్రీన్ ఆపిల్ రోజూ తింటే..లివర్, లంగ్స్ సమస్యలు దూరం

పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. అందులో గ్రీన్ ఆపిల్ ప్రయోజనాలు తెలుసుకుంటే..ఇక వదిలిపెట్టరు. చూడ్డానికి విభిన్నంగా ఉన్నా..ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువ. ఆ వివరాలు మీ కోసం..

యాపిల్ ఆరోగ్యపరంగా చాలా మంచిదనే విషయంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. ప్రకృతిలో యాపిల్ వివిధ రంగుల్లో లభ్యమౌతుంటుంది. సాధారణంగా అందరికీ తెలిసింది రెడ్ లేదా ఎల్లో ఆపిల్. ఎక్కువగా ఇష్టపడేది కూడా ఇవే. కానీ గ్రీన్ ఆపిల్ ఎప్పుడైనా తిన్నారా..గ్రీన్ ఆపిల్ రోజూ డైట్‌లో భాగంగా చేసుకుంటే చాలా రకాల వ్యాధుల్ని దూరం పెట్టవచ్చంటున్నారు. గ్రీన్ ఆపిల్ ప్రయోజనాలు తెలుసుకుందాం..

గ్రీన్ ఆపిల్ ప్రయోజనాలు

గ్రీన్ ఆపిల్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, డిటాక్సిఫైయింగ్ ఏజెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరం నుంచి విష పదార్ధాల్ని తొలగించడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. లివర్‌ను హెపటిక్ కండీషన్ నుంచి కాపాడుతాయి. ప్రతిరోజూ గ్రీన్ ఆపిల్ తీసుకోవడం అలవాటు చేసుకుంటే..లివర్ ఫంక్షన్ మెరుగుపడుతుంది. 

ఎముకలకు బలం

మీ శరీరాన్ని స్ట్రాంగ్‌గా ఉంచాలనుకుంటే..ముందుగా ఎముకలు పటిష్టంగా, బలంగా ఉండాలి. దీనికోసం ప్రతిరోజూ క్రమం తప్పకుండా గ్రీన్ ఆపిల్ తీసుకోవాలి. 30 ఏళ్ల తరువాత బోన్ డెన్సిటీ సాదారణంగా తగ్గుతుంటుంది. గ్రీన్ ఆపిల్‌తో ఈ సమస్యను దూరం చేయవచ్చు.

కంటి వెలుగును పెంచడంలో..

గ్రీన్ ఆపిల్‌లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కేవలం కంటి వెలుగును పెంచడంలోనే కాకుండా..రేచీకటి సమస్యను నిరోధిస్తుంది. గ్రీన్ ఆపిల్‌ను ఐ ఫ్రెండ్ అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. 

ఊపరితిత్తులకు రక్షణ

ఇటీవలి కాలంలో కాలుష్యం కారణంగా ఊపిరితిత్తులకు హాని చేకూరుతోంది. శ్వాస సంబంధిత వ్యాధులు పెరిగిపోతున్నాయి. ఒకవేళ మీరు క్రమం తప్పకుండా గ్రీన్ ఆపిల్ తినడం అలవాటు చేసుకుంటే..ఊపిరితిత్తుల వ్యాధి ముప్పు చాలావరకూ తగ్గిపోతుంది. 

Also read: Weight Loss Tips: ఉసిరి రసంతో సీజనల్‌ వ్యాధులతో పాటు, బరువు, మధుమేహానికి చెక్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News