ఆరోగ్యంగా ఉండేందుకు చాలా రకాలుగా ప్రయత్నించాల్సి ఉంటుంది. ఆహార పదార్ధాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. అయితే ఏ పదార్ధాల్ని ఏ రూపంలో తీసుకోవాలనేది తెలుసుకోవాలి. లేకపోతే ఎన్ని తిన్నా ప్రయోజనం ఉండదు. ఆ వివరాలు మీ కోసం..
ఆరోగ్యంగా ఉండేందుకు ప్రకృతిలో చాలా పదార్ధాలు అందుబాటులో ఉన్నాయి. ఏవి ఎప్పుడు ఎలా తినాలో తెలుసుకుంటే చాలా ప్రయోజనాలు లభిస్తాయి. అది తెలుసుకోనంతవరకూ ఎన్ని తిన్నా ప్రయోజనం శూన్యం. ముఖ్యంగా కొన్ని పదార్ధాల్ని నీళ్లలో నానబెట్టి తినాల్సి ఉంటుంది. నీళ్లలో నానబెట్టడ వల్ల కొన్ని పదార్ధాలు స్ప్రౌట్స్‌గా మారతాయి. ఇందులో పోషకాలు, ఎనర్జీ సంపూర్ణంగా ఉంటుంది. ఇవి తినడం వల్ల చాలా రకాల వ్యాధుల ముప్పు తొలగిపోతుంది.
పెసలు
పెసలులో ప్రోటీన్లు, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, విటమిన్ బి వంటి న్యూట్రియంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని నానబెట్టి తినడం వల్ల అధిక రక్తపోటు, డయాబెటిస్, కేన్సర్ వంటి వ్యాధుల ముప్పు తొలగిపోతుంది.
కిస్మిస్
కిస్మిస్‌లో పోషక పదార్ధాలు మెండుగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలుంటాయి. కిస్మిస్‌ను నానబెట్టి తినడం వల్ల చాలా లాభాలున్నాయి. కిస్మిస్ క్రమం తప్పకుండా తినడం వల్ల ఎనీమియా, కిడ్నీ స్టోన్స్, ఎసిడిటీ వంటి వ్యాధులు దూరమౌతాయి.
శెనగలు
శెనగల స్ప్రౌట్స్ తినడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఇవి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శెనగల్ని స్పౌట్స్ రూపంలో తీసుకుంటే మలబద్ధకం సమస్య కూడా దూరమౌతుంది. ఇది స్టామినా పెంచుతుంది. శరీరానికి ఎనర్జీ ఇస్తుంది.
అంజీర్
అంజీర్‌లో జింక్, మెగ్నీషియం, ఐరన్, ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అంజీర్ నానబెట్టి తినడం వల్ల బరువు తగ్గడం, కొలెస్ట్రాల్ తగ్గడంలో ఉపయోగం కలుగుతుంది. అంజీర్ శరీరంలో రక్తహీనతను పరిష్కరిస్తుంది.
బాదం
విటమిన్ ఎ, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉండే బాదం నానబెట్టి తింటే ఆరోగ్యానికి చాలా లాభదాయకంగా ఉంటుంది. బాదం రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే మెదడు పనితీరు మెరుగవుతుంది. గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.
మెంతులు
మెంతుల్లో పోషక పదార్ధాలు పుష్కలంగా లభిస్తాయి. వీటిని రాత్రి పూట నానబెట్టి ఉదయం పరగడుపున తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. నానబెట్టిన మెంతులు తినడం వల్ల స్థూలకాయం, కొలెస్ట్రాల్, డయాబెటిస్ నియంత్రణలో ఉంటాయి. మెంతులు రోజూ ఇలా తినడం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు దూరమౌతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook