Benifits of Drinking Tea: మిల్క్ టీ, బ్లాక్ టీ, గ్రీన్ టీ, మసాలా టీ, బాదం టీ.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దదిగానే ఉంటుంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో టీ తాగడమనేది నిత్య అలవాటు. భారత్, చైనా, జపాన్ తదితర దేశాల్లో రకరకాల 'టీ'లను నిత్యం తీసుకుంటారు. రోజు టీ తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
గుండె సమస్యలు దూరం :
టీలో పాలీ ఫెనాల్స్, కాటెచిన్స్, థెఫ్లావిన్స్, థెరౌబిసిన్‌లు ఉంటాయి. ఇవి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్, కార్డియోప్రొటెక్టివ్ లక్షణాలను కలిగి ఉంటాయి. తాజా పరిశోధన ప్రకారం టీ క్యాన్సర్, గుండె సమస్యలతో పోరాడడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.
టీ పొడిలో అధిక మొత్తంలో లభించే యాంటీ ఆక్సిడెంట్లు రక్తం నుంచి హానికరమైన అణువులను తొలగించి మంటను తగ్గించడంలో సహాయపడతాయి. యూఎస్‌టీ కౌన్సిల్ ప్రకారం.. బ్లాక్ టీ, గ్రీన్ టీ, హెర్బల్ టీలలో ఉండే అధిక స్థాయి ఫ్లేవనాయిడ్స్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. తద్వారా బాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్‌లు సోకకుండా ఇది దోహదపడుతుంది. టీ తాగడం... ఒకింత ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. పని భారంలో ఉన్నవారికి, ఒత్తిడిని ఎదుర్కొంటున్నవారికి మానసికంగా కాస్త ఉపశమనాన్ని కలగజేస్తుంది.
కొన్ని పరిశోధనల ప్రకారం... ప్రతిరోజూ 1 కప్పు టీ తాగడం వల్ల స్ట్రోక్ లేదా గుండె సమస్యలు వచ్చే రిస్క్ 4 శాతం మేర తగ్గుతుంది. ఇది యుక్త వయస్సులో మరణించే ప్రమాదాన్ని 1.5 శాతం మేర తగ్గిస్తుంది. అయితే వేడి వేడి టీ తాగడం వల్ల అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి బాగా వేడిగా ఉన్న టీ కాకుండా కాస్త గోరు వెచ్చని టీ మాత్రమే తీసుకోవాలి.
Also Read: Bandi Sanjay: తెలంగాణలో మళ్లీ వరి రగడ..సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ..!
Also Read: Viral News: తన మూత్రాన్ని తానే తాగుతున్న యువకుడు... ఇది 'నిత్య యవ్వన' సీక్రెట్ అట...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.