Cholesterol Tips: ఈ పదార్ధాలు క్రమం తప్పకుండా తీసుకుంటే చాలు..కొలెస్ట్రాల్ మటుమాయం

Cholesterol Tips: ఆధునిక జీవనశైలి, వివిధ రకాల ఆహారపు అలవాట్ల కారణంగా పలు వ్యాధులు చుట్టుముడుతుంటాయి. కొలెస్ట్రాల్, గుండె వ్యాధులు ప్రధానమైనవి. ప్రతిరోజూ డైట్‌లో కొన్ని రకాల పండ్లు తీసుకుంటే కొలెస్ట్రాల్ అత్యంత సులభంగా తగ్గించవచ్చు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 30, 2023, 02:10 PM IST
Cholesterol Tips: ఈ పదార్ధాలు క్రమం తప్పకుండా తీసుకుంటే చాలు..కొలెస్ట్రాల్ మటుమాయం

Cholesterol Tips: సీజన్‌తో సంబంధం లేకుండా తలెత్తే వ్యాధుల్లో ముఖ్యమైనవి గుండెపోటు, కొలెస్ట్రాల్. వివిధ రకాల ఆహారపు అలవాట్లే ఇందుకు ప్రధాన కారణం. ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా కొలెస్ట్రాల్, గుండెపోటు వ్యాధుల్ని దూరం చేయవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

కొలెస్ట్రాల్ అనేది చాలా ప్రమాదకరం. ప్రాణాంతకమైన గుండెపోటుకు పెరగడానికి కారణం కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ తగ్గితే గుండెపోటు సహజంగానే తగ్గిపోతుంది. 
శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు రక్తనాళికల్లో పేరుకుపోతుంటుంది. ఫలితంగా రక్త సరఫరాలో ఇబ్బంది ఏర్పడి..రక్తపోటు పెరగడం, గుండెపోటుకు కారణం కావడం జరుగుతుంది. అయితే డైట్‌లో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా కొలెస్ట్రాల్ తగ్గించవచ్చు. కొన్ని రకాల పండ్లను డైట్‌లో భాగంగా చేసుకుంటే..కొలెస్ట్రాల్ సులభంగా తగ్గించవచ్చు.

ద్రాక్ష

ద్రాక్షలో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ద్రాక్షను డైట్‌లో భాగంగా చేసుకుంటే కొలెస్ట్రాల్ నియంత్రణ సులభతరమౌతుంది. ద్రాక్షలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ తగ్గించడంలో దోహదపడతాయి.

పియర్

పియర్‌లో కొలెస్ట్రాల్ తగ్గించే గుణాలు ఎక్కువ. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఫుష్కలంగా ఉంటాయి. ఫలితంగా రోజూ ఇవి తీసుకుంటే కొలెస్ట్రాల్ అద్భుతంగా నియంత్రితమౌతుంది. ఇందులో పేక్టిన్ అనే ఫైబర్ ఇందుకు దోహదపడుతుంది. 

యాపిల్

యాపిల్‌లో  పోలిఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. యాపిల్ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. శరీరంలో మెటబోలిజం పెరిగి కొలెస్ట్రాల్ తగ్గడంలో దోహదమౌతుంది. యాపిల్ అనేది కొవ్వును చాలా వరకూ తగ్గిస్తుంది. గుండె సంబంధిత వ్యాధుల ముప్పు దూరం చేసేందుకు ఉపయోగపడుతుంది.

బొప్పాయి

బొప్పాయి  గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి వంటి పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. యాపిల్ తినడం వల్ల కొలెస్ట్రాల్ చాలా వేగంగా కరుగుతుంది. బ్లడ్ ప్రెషర్ కూడా నియంత్రణలో ఉంటుంది. 

ఆరెంజ్, నిమ్మ

ఆరెంజ్, నిమ్మలతో కొలెస్ట్రాల్ వేగంగా కరుగుతుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పెద్ద మొత్తంలో ఉంటాయి. ఫలితంగా కొలెస్ట్రాల్ వేగంగా కరుగుతుంది. గుండె సంబంధిత వ్యాధుల ముప్పు కూడా తగ్గుతుంది. 

Also read : Healthy Foods: ఈ 5 పదార్థాలు తింటే చాలు..హార్ట్ ఎటాక్ ముప్పు పోయినట్టే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News