Heart Health: ఇటీవలి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయస్సులవారికి గుండె వ్యాధులు ఎదురౌతున్నాయి. కానీ సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ గుండె బలహీనమై వివిధ రకాల సమస్యలు తలెత్తుతుంటాయి. ఈ పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే జీవనశైలిని ముందుగా మార్చుకోవల్సి ఉంటుంది. వయస్సు పెరిగే కొద్దీ గుండె ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
గుండె ఆరోగ్యం చాలా ముఖ్యం. వయసు పెరిగే కొద్దీ కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. ఇందులో ముఖ్యమైంది శరీరం ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉండేలా చూసుకోవాలి. పగలంతా తగినంత మోతాదులో అంటే 7-8 గ్లాసుల నీళ్లు తప్పకుండా తీసుకోవాలి. వాటర్ కంటెంట్ అధికంగా ఉండే పండ్లు తినాలి. బయటకు వెళ్లేటప్పుడు కూడా వాటర్ బాటిల్ క్యారీ చేస్తుండాలి. రెండవది ఫిజికల్ ఎక్సర్సైజ్. రోజూ తగిన సమయం వ్యాయామం చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. జిమ్‌కు వెళ్లి గంటల తరబడి వర్కవుట్స్ అవసరం లేదు. లైట్ వాకింగ్, యోగా కూడా చేయవచ్చు.
రోజూ డైట్లో పౌష్ఠికాహారం ఉండేట్టు చూసుకోవాలి. గుండె ఆరోగ్యానికి అవసరమయ్యే పోషకాలు తీసుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్ ఎప్పుడూ బాగుండేట్టు చూసుకోవాలి. నువ్వులు, సన్‌ఫ్లవర్ సీడ్స్ తప్పకుండా సేవించాల్సి ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యమైనది నవ్వు. మనస్సు విప్పి నవ్వడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందంటారు. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు నవ్వు మంచి విధానం. దీనివల్ల రక్త సరఫరా మెరుగుపడుతుంది.
మంచి నిద్ర కూడా ఆరోగ్యానికి కారణం. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తగినంత నిద్ర తప్పనిసరిగా ఉండాలి. రోజూ రాత్రి వేళ 7-8 గంటలు నిద్ర తప్పకుండా ఉండాలి.
Also read: VIVO X100 Ultra: 200MP కెమేరా, 16జీబీ ర్యామ్ దిమ్మతిరిగే ఫీచర్లతో వివో నుంచి కొత్త ఫోన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook