Anemia Remedies: రోజూ పరగడుపున తీసుకంటే ఎనీమియా సమస్యకు నెల రోజుల్లో చెక్

Anemia Remedies: మనిషి ఆరోగ్యానికి వివిధ రకాల పోషకాలు చాలా అవసరం. ఈ పోషకాలు ఏ మాత్రం లోపించినా వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. ఈ సమస్యల్లో అతి ప్రధానమైంది ఎనీమియా. ఎనీమియా సమస్యకు ఎలా చెక్ చెప్పాలో తెలుసుకుందాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 3, 2024, 07:59 PM IST
Anemia Remedies: రోజూ పరగడుపున తీసుకంటే ఎనీమియా సమస్యకు నెల రోజుల్లో చెక్

Anemia Remedies: శరీరంలో రక్త హీనత సమస్య చాలా ప్రమాదకరం. రక్తంలో హిమోగ్లోబిన్ లోపిస్తే చాలా రకాల సమస్యలకు కారణమౌతుంది. ఈ సమస్యకు చెక్ చెప్పేందుకు ప్రకృతిలో చాలా రకాల పదార్ధాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ముఖ్యమైంది కిస్మిస్. రక్త హీనత సమస్యకు అద్భుతంగా పనిచేస్తుంది. 

దానిమ్మ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరకం. శరీరంలో రక్త హీనత సమస్యను దూరం చేసేందుకు దానిమ్మ జ్యూస్ సేవిస్తుంటారు. దానిమ్మలో ఉండే ఐరన్, విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. రక్త హీనత సమస్యను పరిష్కరించేందుకు దానిమ్మ కంటే బెస్ట్ ఆప్షన్ కిస్మిస్. ఓ వంద రూపాయలు పెట్టి కిస్మిస్ కొనుగోలు చేస్తే నెలంతా ఎనీమియా లక్షణాల్ని దూరం చేసేందుకు పనిచేస్తుంది. అటు దానిమ్మ ఇటు కిస్మిస్ రెండూ రక్త హీనత సమస్యకు చెక్ చెప్పేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతి 100 గ్రాముల కిస్మిస్ పండ్లలో 1.8 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. అదే దానిమ్మలో 0.3 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. ఎనీమియా సమస్య నుంచి త్వరగా విముక్తి పొందాలంటే కిస్మిస్ అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ 4 కిస్మిస్ పండ్లను గ్లాసు నీళ్లలో కలిపి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం పరగడుపున కిస్మిస్ పండ్లను నమిలి తిని నీళ్లు తాగాలి. ఇలా ఓ నెల రోజులు చేస్తే చాలు ఎనీమియా సమస్య అద్భుతంగా తగ్గుతుంది. 

కిస్మిస్ పండ్లతో ప్రయోజనాలు

కిస్మిస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబియల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి పండ్లు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. కిస్మిస్‌లో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సిడేటివ్ స్ట్రెస్ దూరం చేసేందుకు , కేన్సర్ ముప్పు తగ్గించేందుకు దోహదపడుతుంది. కిస్మిస్‌లో పొటాషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గుండె వ్యాధుల్నించి కాపాడుతుంది. కిస్మిస్‌లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో విటమిన్ ఎ, బీటా కెరోటిన్ కంటికి చాలా మంచిది. అంతేకాకుండా ఎసిడిటీ, అలసట దూరం చేస్తుంది. కిస్మిస్ నీళ్లు రోజూ క్రమం తప్పకుండా తాగడం వల్ల జీర్ణక్రియ సంబంధిత సమస్యలు దూరమౌతాయి. 

Also read: AP Heavy Rains: ఏపీకు మళ్లీ భారీ వర్షాల ముప్పు, ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News